నోకియా ‘మాస్టర్ మైండ్’!!

Posted By: Super

నోకియా ‘మాస్టర్ మైండ్’!!

 

స్మార్ట్‌ఫోన్ తెర పై సరళమైన రీతిలో పుస్తకాలను చదువుకునేందుకు వీలుగా నోకియా తన లూమియా సిరీస్ హ్యాండ్‌సెట్‌ల కోసం ఈ-బుక్ అప్లికేషన్‌ను డిజైన్ చేసింది. పేరు ‘నోకియ రీడింగ్’. మొట్టమొదటి సారిగా ఈ అనువర్తనాన్ని 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై ప్రకటించారు.

విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు ఈ నోకియా రీడింగ్ అప్లికేషన్ పూర్తి స్ధాయిలో సహకరిస్తుంది. తద్వారా, యూజర్లు కంటెంట్‌ను చదివే క్రమంలో ఏ విధమైన ఆసౌకర్యానికి గురికారు. తమ వినియోగదారులకు ఉత్తమ శ్రేణి ఈ-బుక్ రీడింగ్‌ను అందించే క్రమంలో, ప్రముఖ ప్రచరణకర్తలైన హచెట్-పియర్సన్, పెంగ్విన్ సంస్థలతో నోకియా కలిసి పనిచేస్తోంది. యూజర్ ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా వారి ఇష్టమైన రచయితల పుస్తకాలతో పాటు నచ్చిన నవలలను చదవచ్చు.

అంతేకాదు, స్థానిక భాషలలో ప్రచురితమైన పుస్తకాలను సైతం ఈ అప్లికేషన్ సౌలభ్యతతో వీక్షిణ లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన కొత్త పుస్తకాలకు సంబంధించిన వివరాలను ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. త్వరలో విడుదల కానున్న ‘నోకియా రీడింగ్ అప్లికేషన్’ లూమియా 900, 710,800,610 మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot