41 మెగా పిక్సల్ కెమెరా ఫోన్ నోకియా లూమియా 1020 ఆవిష్కరణ

Posted By:

విశ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా తన లూమియా సిరీస్ నుంచి ‘లూమియా 1020' శక్తివంతమైన 41 మెగా పిక్సల్ కెమెరా ఫోన్‌ను గురువారం న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. లూమియా 1020 మోడల్ జినాన్ ఫ్లాష్ ఇంకా ఎల్ఈడి ఫ్లాష్‌తో కూడిన పటిష్టమైన 41 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

4.2 అంగుళాల అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1280 x 768 పిక్సల్స్)
41 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
మైక్రోసాఫ్ట్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
32జీబి గిగాబైట్ ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్, 7జీబి క్లౌడ్ స్టోరేజ్.
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ,

నోకియా లూమియా 1020 విక్రయాలను ఏటీ అండ్ టీ నెట్‌వర్క్ యూఎస్ మార్కెట్లో రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పై జూలై 26 నుంచి విక్రయించనుంది. ధర $299.99 (ఇండియన్ మార్కెట్ ధర రూ.17,890).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot