బిజీ బిజీగా నోకియా!

Posted By: Super

బిజీ బిజీగా నోకియా!

 

ఎడతెరిపిలేని మొబైల్  ఫోన్ ల ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్ నోకియా భారతీయ వినియోగదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇటీవల భారత్ మార్కెట్లో ‘ప్యూర్ వ్యూ 808’పేరుతో 41 మెగా పిక్సల్ కెమెరా సామర్ధ్యం గల కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న నోకియా వచ్చే అగష్టునాటికి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లూమియా 610, లూమియా 900 మోడళ్లలో వస్తున్నఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను తొలిగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (2012, ఫిబ్రవరి) లో ప్రకటించారు. నోకియా ఇండియా సంచాలకులు, స్మార్డ్ పరికరాలు విభాగాధపతి విపుల్ మెహ్రోత్రా ఈ అంశం పై మాట్లాడుతూ విండోస్ ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఈ డివైజ్‌లను జూలై చివరినాటికి లేదా అగుష్టు మధ్య నాటికి విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ గ్యాడ్జెట్‌లకు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను ఆయన వెల్లడించారు.

లూమియా 610:

3.7 అంగుళాల టచ్ స్ర్కీన్,

5మెగా పిక్సల్ కెమెరా,

విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

800మెగాహహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

256ఎంబీ ర్యామ్.

లూమియా 900:

4.3 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

16జీబి ఇంటర్నల్ మెమెరీ,

512ఎంబీ ర్యామ్,

7.5 మ్యాంగో ఆఫరేటింగ్ సిస్టం,

1.4గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

ధర అంచనా రూ.11,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot