నోకియా నుంచి ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి, ధర, ఫీచర్లు ఇవే !

Written By:

HMD Global నోకియా బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్లో సింహభాగాన్ని కొల్లగొట్టేందుకు ఈ సంస్థ భారీ కసరత్తునే చేస్తోంది. అందులో భాగంగా కంపెనీ Nokia 8 Sirocco, Nokia 7 plus, new Nokia 6 పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను ఒకే సారి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్లు దేశ వ్యాప్తంగా అన్ని నోకియా స్టోర్లలో అలాగే ఈ కామర్స్ సైట్లలో లభిస్తాయని కంపెనీ తెలిపింది. కాగా ఆఫ్ లైన్లో కాని ఆన్ లైన్లో కాని ధరల్లో ఎటువంటి మార్పులు ఉండవని రెండు చోట్లా ఒకటే ధరలు ఉంటాయని కంపెనీ తెలిపింది. Nokia 8 Sirocco ధరను రూ.49,999గా, Nokia 7 plus ధరను రూ.25,999గా, నోకియా 6 ధరను రూ. 16,999గా కంపెనీ ప్రకటించింది. కాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫ్లాట్ పాం మీద రన్ కానున్నాయి. కాగా 2017లో ఇండయా మార్కెట్లో సత్తా చాటామని అదే ఊపుతో 2018ని కూడా కొనసాగిస్తామని యూజర్లు అభిమానాన్ని చూరగొంటామని HMD Global Vice President India Ajey Mehta తెలిపారు. మూడు ఫోన్లు ఫీచర్లు అందుబాటులోకి ఎప్పుడు వస్తాయనే విషయాలపై ఓ లుక్కేయండి.

ఈ సారి పేమెంట్ బ్యాంకులను టార్గెట్ చేసిన జియో, 10 పాయింట్లు మీ కోసం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 6 2018 ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 7 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 8 సిరోకో ఫీచర్లు

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

ధర, అందుబాటులోకి ఎప్పుడు

నోకియా 6 2018 స్మార్ట్‌ఫోన్ బ్లాక్/కాపర్, వైట్/ఐరన్, బ్లూ/గోల్డ్ రంగుల్లో రూ.16,999 ధరకు ఈ నెల 6వ తేదీ నుంచి అమెజాన్, నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లలో లభ్యం కానుంది.
బ్లాక్/కాపర్, వైట్/కాపర్ రంగుల్లో నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రూ.25,999 ధరకు ఈ నెల 30వ తేదీ నుంచి లభ్యం కానుంది.
నోకియా 8 సిరోకో బ్లాక్ కలర్‌లో రూ.49,999 ధరకు ఈ నెల 30వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లలో రెండు ఫోన్లకు ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia launches three new smartphones - and an online store More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot