3,500 మంది ఉద్యోగులకు నోకియా ఉద్వాసన..!!

Posted By: Super

3,500 మంది ఉద్యోగులకు నోకియా ఉద్వాసన..!!

మొన్నిటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రారాజు లాగా వెలుగొందిన మొబైల్ తయారీదారు నోకియా ఇటీవల కాలంలో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్, గూగుల్ కొత్త ప్లాట్ ఫామ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ దెబ్బకి మొబైల్ మార్కెట్లో నిలబడలేక పోతుంది. ఇందులో భాగంగానే బుధవారం నాడు సుమారు 3,500 ఉద్యోగులకు నోకియా ఉద్వాసన పలికినట్లు సమాచారం.

నోకియా ఉత్పత్తి ప్లాంటు ఫెసిలిటీలున్న క్లుజీ, రొమేనియాల నుండి 2,200 మంది ఉద్యోగులకు, అదే విధంగా కంపెనీ లోకేషన్, బిజినెస్ సెంటర్స్ ఉన్న బాన్, జర్మనీ, పెన్, మాల్విన్ నుండి సుమారు 1,300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మొత్తంగా నోకియా 3,500 మంది ఉద్యోగులను విధుల నుండి తప్పించడం జరిగింది. 2012 సంవత్సరం చివరి నుండి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంలో నోకియా సిఈవో స్టీఫెన్ ఎలాప్ మాట్లాడుతూ ప్రస్తుతం మేము విధివిధాలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. స్ట్రాటజీకి అనుకూలంగానే అభివృద్ది అనేది ఉందని అన్నారు. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నోకియా తెలిపింది. ఇందులో భాగంగా రొమేనియాలో తయారీ కర్మాగారాన్ని మూసివేయాలని కూడా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 7,000 మంది ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుందని అంచనా. ఇది ఇలా ఉంటే భారత్‌పై ప్రభావం పెద్దగా ఉండదని న్యూఢిల్లీలో ఉన్ననోకియా కంపెనీ ప్రతినిధి తెలపడం జరిగింది.

నోకియా పరిస్దితి‌ ఇలా అవ్వడానికి కారణం:

దాదాపు 15 ఏళ్లుగా 'కనెక్టింగ్ పీపుల్' అంటూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన 'నోకియా' ఇప్పుడు 'డిస్కనెక్టింగ్ పీపుల్' అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్లో పెరిగిన పోటీ, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మొబైల్ కంపెనీలు, కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటివి నోకియా పతనానికి కారణమయ్యాయి. అంతేకాకుండా.. యాపిల్ ఐఫోన్ ప్రపంచ వ్యాప్తంగా హిట్ కావడం మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో శాంసంగ్ అందిస్తున్న గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 'నోకియా' సిగ్నల్స్‌కు జామర్‌లుగా మారాయి.

మార్కెట్లో నోకియా వెనుకబడటానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు ఎక్కువగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మొబైల్ ఫోన్లపై ఆసక్తి చూపుతుంటే నోకియా మాత్రం తన స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ సింబయాన్‌తో పాత చింతకాయ పచ్చడిలా ఉపయోగిస్తుంది. అంతేకాకుండా నోకియా స్మార్ట్‌ఫోన్ ధరలు కూడా సామాన్యులకు అందంత ఎత్తులో ఉంటాయి. దీనికి తోడు ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశిస్తున్న చిన్నా చితకా మొబైల్ కంపెనీలు తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లను కలిగిన మొబైల్ ఫోన్లను అందిస్తుండటం నోకియాను వెనక్కు నెట్టిందని చెప్పవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot