మార్కెట్లోకి నోకియా లూమియా 1020.. ధర రూ.47,222

Posted By:

41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరాతో రూపుదిద్దుకున్ నోకియా అధికముగింపు స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020' ఇండియన్ మార్కెట్లో రూ.47,222కు లభ్యమవుతోంది. నోకియా అధికారిక ఆన్‌లైన్ షాప్ లూమియా 1020 హ్యాండ్‍‌సెట్‌ను రూ.49,999కి ఆఫర్ చేస్తుంది. మరో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ లూమియా 1020 హ్యాండ్‌సెట్‌ను రూ.47,222కి ఆఫర్ చేస్తోంది.

లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.

మార్కెట్లోకి  నోకియా లూమియా 1020.. ధర రూ.47,222

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లూమియా 1020 ఫోన్ ప్రత్యేకతలు:

కెమెరా ఫీచర్ : ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.

ఫోన్ స్ర్కీన్: నోకియా లూమియా 1020 స్మార్ట్ ఫోన్ 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్ర్కీన్ రిసల్యూషన్ సామర్ధ్యం 1280x 768పిక్సల్స్), పటిష్టమైన గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ఫోన్ మన్నికను రెట్టింపుచేస్తుంది.

లూమియా 1020లో 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. ఏర్పాటు చేసిన 2జీబి ర్యామ్ ఫోన్ సామర్ధ్యాన్ని మరింత బోలపేతం చేస్తుంది. 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి క్లౌడ్ స్టోరేజ్ ఉచితం. లూమియా 1020లో శక్తివంతమైన 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని నిక్షిప్తం చేయటం జరిగింది. ఈ బ్యాటరీ సాధారన నెట్‌వర్క్ పై 19.1 గంటల టాక్‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 13 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting