ఈబే ఇండియాలో అమ్మకానికి సిద్ధంగా నోకియా లూమియా 1020

నోకియా కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020'ను కొనుగోలు చేసేందకు అనేకమంది భారతీయ వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఇండియన్ మార్కెట్లో లూమియా 1020 విడుదలకు సంబంధించి నోకియా ఇప్పటి వరకు అధికారిక ప్రకటనను వెలవరించలేదు. ఈ నేపధ్యంలో గిజ్‌బాట్ ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించింది. దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌లలో ఒకటైన ఈబేఇండియా (ebay India) నోకియా లూమియా 1020 మోడల్ వివరాలను తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. ఈ రిటైలింగ్ దిగ్గజం లూమియా 1020 ధరను రూ. 51,847గా తన లిస్టింగ్స్‌లో పేర్కొంది.
నోకియా లూమియా 920 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 41 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 4.5 అంగుళాల ఆమోల్డ్ డబ్ల్యూఎక్స్‌జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, నోకియాప్రో అప్లికేషన్, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్ కనెక్టువిటీ.


Click it and Unblock the Notifications








