Home
Mobile

నోకియా లూమియా 1320 (ఫస్ట్ లుక్)

బ్రాండెడ్ కంపెనీకి చెందిన పెద్దతెర స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఈ హుందానే వేరు. అయితే, సగటు భారతీయుడికి అధిగముగింపు స్మార్ట్‌ఫోన్ కలగానే మిగిలిపోతోంది. ఈ నేపధ్యంలో ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ నోకియా సరికొత్త ఫాబ్లెట్ (పెద్ద తెర ఫోన్)తో ముందుకొచ్చింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల అమ్మకందారైన నోకియా ఆసక్తికర ధర శ్రేణిలో 6 అంగుళాల డిస్‌ప్లే కలిగిన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ఇటీవల అబుదాబీలోని నిర్వహించిన ‘నోకియా 2013 వరల్డ్ ఈవెంట్'లో ఆవిష్కరించింది.

నోకియా లూమియా 1320 (ఫస్ట్ లుక్)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ డివైజ్ అన్‌లాకుడ్ వర్షన్ ధర 339 డాలర్లు. 6 అంగుళాల 720పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వంటి ప్రధాన ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ముఖ్యంగా ఆసియా మార్కెట్లను (చైనా, ఫిలిప్పిన్స్, వియాత్నామ్, ఇండియా) టార్గెట్ చేస్తూ, ఇక్కడి మార్కెట్‌లలో అధిక మొత్తం అమ్మకాలు సాగించే విధంగా లూమియా 1320 ధరను 339 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.20,000)గా ప్రకటించటం ఖచ్చితంగా ఆలోచనాత్మకమే.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల దృష్టిలో ‘లూమియా 1320' ధర బడ్జెట్‌కు మించిందే అయినప్పటికి పలు అత్యుత్తమ హార్డ్‌వేర్ స్సెసిఫికేషన్‌లు లూమియా 1320లో ఉన్నాయి. నోకియా స్మార్ట్ మొబైలింగ్ అనుభూతును ఇష్టపడే వారికి లూమియా 1320 బెస్ట్ ఛాయిస్.

డిజైనింగ్:

లూమియా 1320 డిజైనింగ్‌లో భాగంగా ప్రీమియమ్ క్వాలిటీ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్‌ను ఉపయోగించారు. ఈ డివైజ్ పాకెట్ ఫ్రెండ్లీ తత్వాన్ని కలిగి ఉండటంతో సరిగ్గా మీ ప్యాంట్ జేబులలో ఇమిడిపోతుంది. లూమియా 1520.. ఆరెంజ్, బ్లాక్, ఎల్లో ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఫోన్ వెనుక కవర్‌ను యూజర్లు తమ నచ్చిన రంగులో మలచుకునే సౌలభ్యతను నోకియా కల్పిస్తోంది.

డిస్‌ప్లే:

లూమియా 1320, 720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 6 అంగుళాల పెద్దదైన స్ర్కీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో సినిమాలను ఉత్తమమైన ఎంటర్‌టైన్‌మెంట్ క్వాలిటీతో వీక్సించవచ్చు.

హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఇంకా కెమెరా:

లూమియా 1320 హ్యాండ్‌సెట్‌లో 1జీబి ర్యామ్‌తో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్‌ను ఏర్పాటు చేసారు. దింతో యూజర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను ఆస్వాదించవచ్చు. 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో ఫోన్ మెమరీనిగా మరింతగా విస్తరించుకునే సౌలభ్యత. లూమియా 1320, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. నోకియా రీఫోకస్ అప్లికేషన సాయంతో లూమియా 1320ను లైట్రో స్టైల్ కెమెరాగా మార్చేసుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం:

లూమియా 1320 హ్యాండ్‌సెట్‌లో ఆధునిక వర్షన్ విండోస్ ఫోన్ 8 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేయటం జరిగింది. ఈ ఫోన్‌కు విండోస్ ఫోన్ 8 అప్‌డేట్ 3, 2013 ముగింపు నాటికి అందుతుంది. లూమియా 1320 వినియోగదారులు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫీచర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X