విపణిలోకి నోకియా లూమియా 1320

|

బ్రాండెడ్ కంపెనీకి చెందిన పెద్దతెర స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఈ హుందానే వేరు. అయితే, సగటు భారతీయుడికి అధిగముగింపు స్మార్ట్‌ఫోన్ కలగానే మిగిలిపోతోంది. ఈ నేపధ్యంలో ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ నోకియా సరికొత్త ఫాబ్లెట్ (పెద్ద తెర ఫోన్)తో ముందుకొచ్చింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల అమ్మకందారైన నోకియా ఆసక్తికర ధర శ్రేణిలో 6 అంగుళాల డిస్‌ప్లే కలిగిన లూమియా 1320 స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను మంగళవారం నోకియా ఇండియా దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.23,999. జనవరి 14, మంగళవారం నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి.

 

లూమియా 1320 కీలక స్పెసిఫికేషన్‌లు:

సింగిల్ సిమ్, 6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్), విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.7 గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్పల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, 3జీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, వై-ఫై, జీపీఎస్, ఎ-జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ. 3,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: ఆరెంజ్, వైట్, ఎల్లో, బ్లాక్ కలర్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 విపణిలోకి నోకియా లూమియా 1320

విపణిలోకి నోకియా లూమియా 1320

డిజైనింగ్: లూమియా 1320 డిజైనింగ్‌లో భాగంగా ప్రీమియమ్ క్వాలిటీ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్‌ను ఉపయోగించారు. ఈ డివైజ్ పాకెట్ ఫ్రెండ్లీ తత్వాన్ని కలిగి ఉండటంతో సరిగ్గా మీ ప్యాంట్ జేబులలో ఇమిడిపోతుంది. లూమియా 1520.. ఆరెంజ్, బ్లాక్, ఎల్లో ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఫోన్ వెనుక కవర్‌ను యూజర్లు తమ నచ్చిన రంగులో మలచుకునే సౌలభ్యతను నోకియా కల్పిస్తోంది.

 

 విపణిలోకి నోకియా లూమియా 1320

విపణిలోకి నోకియా లూమియా 1320

డిస్‌ప్లే: లూమియా 1320, 720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 6 అంగుళాల పెద్దదైన స్ర్కీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో సినిమాలను ఉత్తమమైన ఎంటర్‌టైన్‌మెంట్ క్వాలిటీతో వీక్సించవచ్చు.

విపణిలోకి నోకియా లూమియా 1320
 

విపణిలోకి నోకియా లూమియా 1320

హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఇంకా కెమెరా: లూమియా 1320 హ్యాండ్‌సెట్‌లో 1జీబి ర్యామ్‌తో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్‌ను ఏర్పాటు చేసారు. దింతో యూజర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను ఆస్వాదించవచ్చు. 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో ఫోన్ మెమరీనిగా మరింతగా విస్తరించుకునే సౌలభ్యత.

 

 

విపణిలోకి నోకియా లూమియా 1320

విపణిలోకి నోకియా లూమియా 1320

లూమియా 1320, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. నోకియా రీఫోకస్ అప్లికేషన సాయంతో లూమియా 1320ను లైట్రో స్టైల్ కెమెరాగా మార్చేసుకోవచ్చు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X