నోకియా నుంచి వస్తున్న కొత్త మోడల్ ఫోన్ ఏంటి..?

Posted By: Super

నోకియా నుంచి వస్తున్న కొత్త మోడల్ ఫోన్ ఏంటి..?

 

హై క్వాలిటీ మొబైల్ ఫోన్లు అదేవిధంగా స్మార్ట్ ఫోన్లను  ఉత్పత్తి చేయ్యటంలో ఉత్తమ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న నోకియా (Nokia) ఆడ్వాన్సడ్ స్పెసిఫికేషన్లతో స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘నోకియా లూమియా  4G LTE’ వర్షన్ లో డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్ వినియోగదారుడి కమ్యూనికేషన్ అవసరాలు తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం పై మొబైల్ రన్ అవుతుంది. 1400 MHz సామర్ధ్యం గల శక్తివంతమైన  క్వాల్కమ్ (Qualcomm) MSM8255 ప్రాసెసర్ ను లోడ్ చేశారు. ర్యామ్ సామర్ధ్యం 512 మెమరీ, ఇంటర్నల్ మెమరీ 16జీబి, 335 గంటల స్టాండ్ బై  సామర్ధ్యం కలిగిన 1450 mAh BV-5JW 3.7 V బ్యాటరీ వ్యవస్థ.

డిస్ ప్లే ఫీచర్లు:

టీఎఫ్టీ (TFT) సామర్ధ్యం గల 3.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, స్ర్కీన్ రిసల్యూషన్  480 x 800 పిక్సల్స్,  ఆమోల్డ్ (AMOLED) క్లియర్ బ్లాక్ కర్వుడ్ గ్లాస్ టెక్నాలజీని  డిస్ ప్లే నిర్మాణంలో ఉపయోగించారు. ఫోన్ బరువు ఖచ్చితంగా 142 గ్రాములు. చుట్టు కొలతలు  116.5 x 61.2 x 12.1 mm.

కనెక్టువిటీ ఫీచర్లు:

జీఎస్ఎమ్  900/1800 MHz సామర్ధ్యం గల నెట్ వర్క్ లను ఈ పోన్ సపోర్ట్ చేస్తుంది, హెచ్ టిఎమ్ఎల్ 5 (HTML5), సీఎస్ఎస్3 (CSS3) ఇంటర్నెట్ వెబ్ బ్రౌజింగ్ కార్యాచరణకు అనుకూలం, జీపీఆర్ఎస్(GPRS) అదే విధంగా ఎడ్జ్( EDGE) టెక్నాలజీల కనెక్టువిటీ

కెమెరా స్సెసిఫికేషన్లు:

3264 x 2448 రిసల్యూషన్ 8.8 మెగా పిక్సల్  కెమెరా, 3x డిజిటల్ జూమ్ టెక్నాలజీతో, వీడియో రికార్డర్, డ్యూయల్  LED ఫ్లాష్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. త్వరలో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ‘నోకియా లూమియా  4G LTE’ ధర ఇతర సంబంధిత సమాచారం తెలయాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot