నోకియా విండోస్ ఫోన్ 9,999కే... త్వరపడండి!

Posted By: Super

 నోకియా విండోస్ ఫోన్ 9,999కే... త్వరపడండి!

 

విశ్వసనీయతకు ప్రతీకగా గుర్తింపుతెచ్చుకున్న ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియా తన లూమియా సిరీస్ ఫ్యామిలీ నుంచి ‘లూమియా 510’ పేరుతో చవక ధర విండోస్ స్మార్ట్‌ఫోన్‍‌లను ఆన్‌లైన్ మార్కెట్లో అమ్మకానికి ఉంచింది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రాధమిక స్థాయి విండోస్ హ్యాండ్‌సెట్‌ను రూ.9,999కు ఆఫర్ చేస్తోంది. నోకియా నుంచి గత జూలైలో విడుదలైన ‘లూమియా 610’ను మార్కెట్లో రూ.12,999కి విక్రయించారు. లూమియా 510ను ఆవిష్కరణ సమయంలో నోకియా అధికారిక వర్గాలు డివైజ్ ధరను రూ.11,000లకు దిగువుగా పేర్కొన్నాయి.

స్పెసిఫికేషన్‌లు:

విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 7.8ఆపరేటింగ్ సిస్టం ),

చుట్టుకొలత 120.7 x 64.9 x 11.5మిల్లీ మీటర్లు, బరువు 129 గ్రాములు,

4 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

800మెగాహెడ్జ్ సింగిల్-కోర్ ప్రాసెసర్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

256ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితం,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్లు (బ్లుటూత్ 2.1+ఈడీఆర్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, 3జీ కనెక్టువిటీ, యూఎస్బీ 2.0 పోర్ట్),

1300ఎమ్ఏహెచ్ బీపీ-3ఎల్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 653 గంటల స్టాండ్‌బై).

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot