లూమియా 510 vs గెలాక్సీ మ్యూజిక్.. ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్?

Posted By: Super

 లూమియా 510 vs గెలాక్సీ మ్యూజిక్.. ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్?

 

ఎంట్రీస్థాయి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సామ్‌సంగ్, నోకియాల మధ్య మరో రసవత్తరమైన పోరు రాజుకుంది. నోకియ తాజాగా ఆవిష్కరించిన విండోస్ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ‘లూమియా 510’, సామ్‌సంగ్ ఎంట్రీ స్థాయి మ్యూజిక్ ఆధారిత ఫోన్ ‘గెలాక్సీ మ్యూజిక్’తో తలపడబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ ఎంట్రీ స్ధాయి ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

బరువు ఇంకా చుట్టుకొలత.......

లూమియా 510: చుట్టుకొలత 120.7 x 64.9 x 11.5మిల్లీమీటర్లు, బరువు 129 గ్రాములు,

గెలాక్సీ మ్యూజిక్: శరీర కొలత 110.1 x 59.0 x 12.25మీల్లీమీటర్లు, బరువు 107 గ్రాములు,

డిస్‌ప్లే.....

లూమియా 510: 4 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

గెలాక్సీ మ్యూజిక్: 3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,

ప్రాసెసర్.....

లూమియా 510: 800మెగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

గెలాక్సీ మ్యూజిక్: వివరాలు తెలియాల్సి ఉంది,

ఆపరేటింగ్ సిస్టం....

లూమియా 510: విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టం (విండోస్ ఫోన్ 7.8కు అప్‌గ్రేడబుల్),

గెలాక్సీ మ్యూజిక్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా......

లూమియా 510: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

గెలాక్సీ మ్యూజిక్: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

స్టోరేజ్........

లూమియా 510: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 256ఎంబీ ర్యామ్,

గెలాక్సీ మ్యూజిక్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ....

లూమియా 510: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ 2.0,

గెలాక్సీ మ్యూజిక్: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ 2.0,

బ్యాటరీ.....

లూమియా 510: 1300ఎమ్ఏహెచ్ బీపీ-3ఎల్ బ్యాటరీ (టాక్‌టైమ్ 6.2 గంటలు, స్టాండ్‌బై 653 గంటలు),

గెలాక్సీ మ్యూజిక్: 1300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),

ధర.......

లూమియా 510: ధర రూ.11,000 (ఈ వారం నుంచి అందుబాటులోకి వస్తుంది).

గెలాక్సీ మ్యూజిక్: ధర అంచనా రూ.10,000.

అదనపు ఫీచర్లు....

లూమియా 510: నోకియా మ్యాప్స్, నోకియా ట్రాన్స్‌పోర్ట్, నోకియా డ్రైవ్ నేవిగేషన్ అప్లికేషన్స్, మూడు నెలల పాటు అపరిమిత నోకియా మ్యూజిక్ ఇంకా నోకియా మిక్స్ రేడియో సేవలను పొందే సౌలభ్యత,

గెలాక్సీ మ్యూజిక్: ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, సౌండ్ ఆలైవ్, ఎస్ఆర్ఎస్ టెక్నాలజీ, డ్యూయల్ సిమ్ వేరియంట్,

తీర్పు.....

పెద్దదైన డిస్‌ప్లే, మన్నికైన కెమెరా పనితీరు, సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ఇంకా క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాలను కోరుకునే వారికి లూమియా 510 ఉత్తమ ఎంపిక. మరో వైపు తక్కువ ధర ఇంకా హై క్వాలిటీ మ్యూజిక్‌ను కోరుకునే వారికి గెలాక్సీ మ్యూజిక్ బెస్ట్ చాయిస్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot