ప్రాణాలను కాపాడిన నోకియా ఫోన్!

Posted By:

ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడి నోకియా లూమియా 1520 నిజమైన హీరో అనిపించుకుంది. శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో రూపకల్పన చేయబడిన నోకియా లూమియా 1520 నో ఓ పోలీసు అధికారిని బుల్లెట్ దాడి నుంచి రక్షించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ అంతర్జాతీయ మీడియా వద్ద నుంచి సేకరించిన వివరాల మేరకు 24 సంవత్సరాల మిలిటరీ పోలీసు అధికారి ఒకరు తన తల్లిదండ్రులకు చూసేందుకు వారి ఇంటికివచ్చాడు.

ప్రాణాలను కాపాడిన నోకియా ఫోన్!

అప్పటికే ఆ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు లూటీ ప్రారంభించారు. ఈ విషయాన్ని గ్రహించిన సదరు పోలీసు అధికారి దొంగులను నిలువరించే ప్రయత్నం చేసాడు. దీంతో ఒక్కసారిగా దుండగులు కాల్పలు ప్రారంభించారు. మొదటి బుల్లెట్ బారి నుంచి ఆ పోలీసు అధికారి తప్పించుకున్నప్పటికి. రెండు బుల్లెట్ నేరుగా అతని ప్యాంట్ జేబులోని లూమియా 1520 స్మార్ట్‌ఫోన్‌ను తాకింది. దీంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. బల్లెట్ తాకిడికి పూర్తి పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణాలను కాపాడిన లూమియా 1520 స్మార్ట్‌ఫోన్‌‌కు అధికారి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot