ఆన్‌లైన్ మార్కెట్లోకి నోకియా లూమియా 525

Posted By:

90 శాతం విండోస్ ఫోన్ మార్కెట్ పై పట్టుసాధించిన నోకియా ఇండియన్ మార్కెట్లో మరో లూమియా సిరీస్ విండోస్ ఫోన్ విక్రయాలను ప్రారంభించింది. 2013, నోకియా వరల్డ్  ఈవెంట్‌లో విడుదలైన లూమియా 525 మోడల్ ఫోన్ ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది.

ఆన్‌లైన్ మార్కెట్లోకి నోకియా లూమియా 525

నోకియా ఆన్‌లైన్ షాప్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.10,399కివిక్రయిస్తోంది. మరో ఈ-కామర్స్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లూమియా 525 హ్యాండ్ సెట్ ను రూ.10,199కి ఆఫర్ చేస్తోంది. మరో రిటైలర్ సాహోలిక్ (saholic) ఈ మధ్య ముగింపు విండోస్ ఫోన్ 8 హ్యాండ్‌సెట్‌ను రూ.9,999కే ఆఫర్ చేస్తోంది.

లూమియా 520 మోడల్‌కు సక్సెసర్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న లూమియా 525 విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. ఫోన్ పరిమాణం 119.9*64*9.9మిల్లీమీటర్లు, బరువు 124 గ్రాములు, 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800x 480పిక్సల్స్), 235 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 2జీ..3జీ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సిస్ చేసుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, 1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ. లూమియా 525 వైట్, బ్లాక్, ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot