నోకియా నుంచి కొత్త ఫోన్ రాబోతుందోచ్!

Posted By:

నోకియా వరల్డ్ 2013 నుంచి ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకున్న లూమియా సిరీస్ విండోస్ స్మార్ట్‌ఫోన్ ‘నోకియా లూమియా 525' అంతర్జాతీయ మార్కెట్లో ఎట్టకేలకు ఆవిష్కరణకు నోచుకుంది. బుధవారం, నోకియా తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా లూమియా 525 హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

నోకియా నుంచి కొత్త ఫోన్ రాబోతుందోచ్!

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్480× 800పిక్సల్స్),
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1గిగాహెట్జ్),
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
7జీబి స్కై డ్రైవ్ స్టోరేజ్,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 10.6 గంటలు, స్టాండ్‌బై టైమ్ 14 రోజులు).

కనెక్టువిటీ ఫీచర్లు:

3జీ సపోర్ట్, బ్లూటూత్, వై-ఫై ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ. ఈ ఫోన్ రెండు మల్టీకలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. సౌకర్యవంతమైన డిజైనింగ్‌తో వస్తున్న లూమియా 525 సరిగ్గా జేబులో ఇమిడిపోతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot