నోకియా పెద్ద తెర స్మార్ట్‌ఫోన్ రూ.4000 ధర తగ్గింపు!

Posted By:

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియా ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న తన పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 625'కు సంబంధించి రూ.4,150 ధర తగ్గింపును ప్రకటించింది. వాస్తవానాకి, నోకియా లూమియా 625 ఫోన్ దేశీయ విపణిలోఅగష్టులో విడుదలైంది. అప్పటి అధికారిక ధర రూ.19,999. తాజాగా ఈ డివైజ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రూ.16,149కే విక్రయిస్తోంది. అంటే, ఫ్లిప్‌కార్ట్ ద్వారా లూమియా 625ను కోనుగోలు చేయటం ద్వారా అక్షరాలా రూ.4.150 ధర రాయితీని పొందవచ్చు. 

నోకియా పెద్ద తెర స్మార్ట్‌ఫోన్ రూ.4000 ధర తగ్గింపు!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లూమియా 625 కీలక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్) 2.225డి గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, ఫొన్ పరిమాణం 9.8మిల్లీమీటర్లు, బరువు 159 గ్రాములు, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8930 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 512 ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ కెమెరా, 1080 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు: ఎడ్జ్, 3జీ, యూఎస్బీ, వై-ఫై హాట్ స్పాట్, హెచ్ఎస్‌పీఏ+ (42ఎంబీపీఎస్), హెచ్ఎస్‌యూపీఏ (5.76), బ్లూటూత్, గ్లోనాస్, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot