లీకైన నోకియా సిక్రెట్స్!!

Posted By:

లీకైన నోకియా సిక్రెట్స్!!

 

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియా ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న లూమియా సిరీస్ స్మార్ట్ ఫోన్ లకు అంతర్జాతీయంగా ఆదరణ నెలకుంది. తాజాగా ఈ లైనప్ నుంచి రాబోతున్న ‘నోకియా 719’ హ్యాండ్ సెట్ కు సంబంధించి పలు ఫీచర్లు బహిర్గతమయ్యాయి.

పలు డాక్యుమెంట్ లలో లభ్యమైన కీలక సమాచారం మేరకు ‘నోకియా 719’ అతిత్వరల్లో ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో లభ్యం కానుంది.

లీకైన ఫీచర్లు:

* 3.7అంగుళాల క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే,

*   5మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,

*   హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

*   ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఇంటిగ్రేటెడ్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,

*   టర్న్ బై టర్న్ నావిగేషన్ డ్రైవ్,

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై ఈ డివైజ్ ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో నోకియా 719 ధర రూ.20,000 ఉండొచ్చని తెలుస్తోంది. విండోస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్ ఇతర హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ స్పెసిఫికేషన్ లు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot