నోకియాకు కీలక సమయం!!

Posted By: Super

నోకియాకు కీలక సమయం!!

 

ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, నోకియాకు కీలకంగా మారింది. తన సామర్ధ్యాన్ని నిరూపించుకునేందుకు ఈ వేదిక సరైనదిగా ఈ దిగ్గజ మొబైల్ కంపెనీ భావిస్తోంది. ఈ భారీ ఈవెంట్‌ను పురస్కరించుకుని 7 సరికొత్త మోడళ్లలో మొబైల్ ఫోన్‌లను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తుంది. నోకియా నుంచి చివరి మోడల్‌గా టెక్ ప్రపంచానికి పరిచయమైన ‘నోకియా లూమియా 730’ కీలక సమాచారం వెబ్‌లో హల్‌చల్ చేస్తుంది. సరికొత్త విండోస్ ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ఇతర ఫీచర్లు:

* విండోస్ ఫోన్ ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

* మల్టీ టచ్ స్ర్కీన్,

* 8 మెగా పిక్సల్ కెమెరా,

* వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

* వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,

‘లూమియా 710’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ఈ ఫోన్ రూపుదిద్దుకున్నట్లు సమాచారం. మొబైల్ ప్రాసెసర్ ఇతర హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది. ధర ఇతర వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot