ఆండ్రాయిడ్ ఆధిపత్యానికి నోకియాతో బ్రేక్ పడనుందా..?

Posted By: Prashanth

ఆండ్రాయిడ్ ఆధిపత్యానికి నోకియాతో బ్రేక్ పడనుందా..?

 

టెక్ మార్కెట్లో రివ్వున దూసుకుపోతున్న ఆండ్రాయిడ్ వేగానాకి కళ్లెం వేసే వ్యూహాలు ఊపందుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ సెక్టార్లో ఆండ్రాయిడ్ అధిపత్యాన్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పనితీరు విషయంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పోటి పడేందుకు విండోస్ కొత్త వర్షన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టంను డిజైన్ చేసింది. నోకియా నుంచి తాజాగా విడుదలవుతున్న ‘లూమీయా 800’ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ బ్రాండ్ ‘నోకియా’తో జత కట్టిన మైక్రోసాఫ్ట్ విండోస్, ఆండ్రాయిడ్‌ను అధిగమిస్తుందో లేదో టెక్ జనులే తేల్చాలి.

ఇక నోకియా నుంచి తాజాగా రిలీజ్ కాబోతున్న ‘లూమీయా 800’, ‘లూమీయా 801T’ ముఖ్య ఫీచర్లు క్లుప్తంగా:

నోకియా లూమియా 800:

* మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం, * 1.4 GHz స్కార్పియన్ ప్రాసెసర్, * అడ్రినో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ సపోర్ట్, * వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ, * 3జి కనెక్టువిటీ, * 3.7 అంగుళాల మల్టీ టచ్ స్క్రీన్, * గొరిల్లా ప్రొటెక్షన్ గ్లాస్, * ఇంటర్నల్ స్టోరేజి 16జీబి, * 8 మెగా పిక్సల్ డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా, * 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * ధర రూ.30,000.

నోకియా లూమీయా 801T :

* సింబియాన్ అన్నా ఆపరేటింగ్ సిస్టం, * 680 MHz ప్రాసెసర్, * 256 ఎంబీ ర్యామ్, * 4 అంగుళాల మల్టీ టచ్ స్క్రీన్, * 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * వీజీఏ సెకండరీ కెమెరా, * జీపీఎష్ మాడ్యుల్, * శక్తివంతమైన బ్యాటరీ, * డిజిటల్ టీవీ సిగ్నల్ స్ట్రీమింగ్, బ్లూటూత్ 3.0, ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot