నోకియా లుమియా 800 ఓ సంచలనం..

Posted By: Staff

నోకియా లుమియా 800 ఓ సంచలనం..

 

నోకియా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి నోకియా విండోస్ స్మార్ట్ ఫోన్ 'నోకియా లుమియా 800' లండన్‌లో 'మొబైల్ ఆఫ్ ద్ ఇయర్' అవార్డుని సొంతం చేసుకున్నట్లు బ్రిట్ మ్యాగజైన్ ప్రచురించింది. నోకియా లుమియా 800 మొబైల్‌కి బ్రిట్ మ్యాగజైన్ యూజర్స్ అక్టోబర్ నెలలో వోటింగ్ వేయడం జరిగింది. ఇక్కడ నోకియా లుమియా 800 ప్రత్యేకత ఏమిటంటే విడుదల కాక ముందే 'మొబైల్ ఆఫ్ ద్ ఇయర్' అవార్డుని సొంతం చేసుకుంది.

ఈ సందర్బంలో బ్రిట్ మ్యాగజైన్ ఎడిటర్ మాట్లాడుతూ నోకియా విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల చేసినటువంటి ఈ నోకియా లుమియా 800 మొబైల్ అత్యుత్తమ మొబైల్ కావడం వల్లనే యూజర్స్ వోటింగ్‌లో ఎక్కవ శాతాన్ని కట్టబెట్టడం జరిగింది. నోకియా లుమియా 800 మొబైల్ ఫోన్‌ని గనుక చూసినట్లేతే అదొక కొత్త ప్రపంచాన్ని స్వాగతిస్తున్న మొబైల్ మాదిరి ఉంటుందని అన్నారు.

నవంబర్ 24న విడుదలకానున్న బ్రిట్ మ్యాగజైన్‌లో విన్నర్ లిస్ట్‌ని ప్రకటించనున్నామని తెలిపారు. బ్రిట్ మ్యాగజైన్ ఇటీవల 'మొబైల్ అవార్డ్స్ 2011' అంటూ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో గెలిచిన వారికి కొన్ని బహుమతులను కూడా ప్రకటించనుంది.

నోకియా లుమియా 800 మొబైల్ ప్రత్యేకతలు:

* 1.4GHz Qualcomm Snapdragon S2 processor

* 3.7″ AMOLED ClearBlack curved display (800 x 480)

* 8-megapixel rear camera (720p HD video)

* 16GB onboard storage

* HSPA+

* Windows Phone 7.5 Mango

* FM Radio

* TV Output

* Bluetooth

* WiFi

* GPS

* Dimensions: 116.5 mm x 61.2 mm x 12.1 mm

* Weight: 142g

* Battery: 1,450mAh

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot