విండోస్ ఫోన్‌ల యుద్ధం!

Posted By: Super

విండోస్ ఫోన్‌ల యుద్ధం!

నోకియా, సామ్‌సంగ్‌ల మధ్య విండోస్ ఫోన్‌ల యుద్ధం రాజుకుంది. నోకియా ద్వారా 2011లో విడుదలైన విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 800’, సామ్‌సంగ్ ద్వారా 2012 జూలైలో విడుదలైన విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ‘వోమ్నియా ఎమ్’ మధ్య పోటీ వాతావారణం నెలకుంది. అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న లూమియా 800 మార్కెట్ ధర రూ.24,999 కాగా మధ్య ముగింపు స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న సామ్‌సంగ్ వోమ్నియా ఎమ్ మార్కెట్ ధర రూ.16,500. ఈ రెండు విండోస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఏది ఉత్తమమైనది..?, మీ ఓటు ఎవరికి..?

డిజైనింగ్, చుట్టు కొలతలు:

142 గ్రాముల బరువుతో రూపాంతరం చెందిన నోకియా లూమియా 800 116.5 x 61.2 x 12.1 మిల్లీమీటర్ల చుట్టుకొలతను సంతరించుకుని ఉంది. 119 గ్రాముల బరువుతో తుదిమెరుగులు దిద్దుకున్న సామ్‌సంగ్ వోమ్నియా ఎమ్ 121.6 x 64.1 x 10.5 మిల్లీమీటర్ల చుట్టుకొలతను నమోదు చేసింది.

లూమియా 800, క్లియర్ బ్లాక్ టెక్నాలజీతో కూడిన 3.7 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వ్యవస్థ పోన్ స్ర్కీన్‌ను ప్రమాదాల నుంచి పరీరక్షిస్తుంది. డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 800 పిక్సల్స్. మరో వైపు వోమ్నియా ఎమ్ 4 అంగుళాల మల్టీటచ్ సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 480 x 800 పిక్సల్స్.

ఆపరేటింగ్ సిస్టం:

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టిం పై పనిచేస్తాయి.

ప్రాసెసర్:

ఈ విభాగంలో నోకియా పై చేయి సాధించింది. 1.4 గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్ 8255 ప్రాసెసర్‌ను లూమియా 800లో వినియోగించారు. 1గిగాహెట్జ్ సమర్థత కలిగిన ప్రాసెసింగ్ వ్యవస్థను వోమ్నియా ఎమ్‌లో నిక్షిప్తం చేశారు.

కెమెరా:

సమర్థవంతమైన 8 మెగా పిక్సల్ కెమెరాను లూమియాలో ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ సామర్ధ్యం 3264 x 2448పిక్సల్స్. కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ఆటోఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరాలో ఒదిగి ఉన్నాయి. మరో వైపు నోకియా లూమియాలో 5 మెగాపిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ సామర్ధ్యం 2592 x 1944పిక్సల్స్. జియో ట్యాగింగ్, ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరాలో ఒదిగి ఉన్నాయి. ఈ ఫోన్‌కు ముందు భాగంలో ఏర్పాటు చేసిన వీజీఏ కెమెరా వీడియో కాలింగ్‌కు దోహదపడుతుంది.

మెమరీ:

నోకియా లూమియా 800, ఇంటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యం 16జీబి, 512ఎంబీ ర్యామ్. వోమ్నియా ఎమ్ ఇంటర్నల్ స్టోరేజ్ 4 ఇంకా 8జీబి వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ర్యామ్ సామర్ధ్యం 384 ఎంబీ. రెండు హ్యాండ్‌సెట్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వ్యవస్థ లోపించింది.

కనెక్టువిటీ:

ఈడీఆర్, ఏ2డీపీ వంటి ప్రత్యేక వ్యవస్థలతో కూడిన బ్లూటూత్ 2.1, వై-ఫై 802.11 b/g/n, హెచ్ఎస్ డిపీఏ 14.4 ఎంబీపీఎస్, హెచ్ఎస్ యూపీఏ 5.76 ఎంబీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి అంశాలు లూమియా 800 కనెక్టువిటీ వేగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. వోమ్నియా ఎమ్‌లో నిక్షిప్తం చేసిన కనెక్టువిటీ ఫీచర్లు...

బ్లూటూత్ 2.1 ఏ2డీపీ,

వై-ఫై 802.11 b/g/n,

వై-ఫై హాట్‌స్పాట్,

డీఎల్ఎన్‌ఏ,

హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్,

మైక్రో యూఎస్బీ 2.0.

బ్యాటరీ:

లూమియా 800లో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన 1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9.5గంటల టాక్‌టైమ్, 335 గంటల స్టాండ్‌బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది). సామ్‌సంగ్ వోమ్నియా ఎమ్‌లో నిక్షిప్తం చేసిన 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7.5 గంటల టాక్‌టైమ్, 420 గంటల స్టాండ్‌బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది).

తీర్పు:

ధర గురించి ఆలోచించే వారికి సామ్‌సంగ్ వోమ్నియా ఎమ్ ఉత్తమమైన ఎంపిక. స్పెసిఫికేషన్‌ల పరంగా ఆలోచించే వారికి నోకియా లూమియా 800 బెస్ట్ ఛాయిస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot