నోకియా vs సోనీ... మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏది?

Posted By: Prashanth

నోకియా vs సోనీ... మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏది?

 

మన్నికతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేయటంలో నోకియా ఇంకా సోనీలు గత కొన్ని సంవత్సరాలుగా క్రీయాశీలక పాత్రపోషిస్తున్నాయి. ఇటీవల కాలంలో బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2012 గ్యాడ్జెట్ ఎగ్గిబిషన్‌లో సోనీ తన ఎక్ప్‌పీరియా సిరీస్ నుంచి ఎక్ప్‌పీరియా టీ, ఎక్ప్‌పీరియా వీ, ఎక్ప్‌పీరియా జే మోడళ్లలో మూడు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరించింది. వీటిలో మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొనబడుతున్న ‘ఎక్ప్‌పీరియా జే’ దేశీయ మార్కెట్లో తాజాగా విడుదలైంది. ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారితంగా స్పందించే ఈ డివైజ్ ధర రూ.16,490. ఇదే సమయంలో నోకియా తన లూమియా సిరీస్ నుంచి డిసెంబర్ 2011లో ‘లూమియా 800’ పేరుతో విడుదలైన విండోస్ స్మార్ట్‌ఫోన్ ధర పై రూ.4,000 ధర తగ్గింపును ప్రకటించింది. లూమియా 800 తాజా ధర రూ.18,867. వివిధ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. రెండు గ్యాడ్జెట్ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా....

బరువు ఇంకా చుట్టుకొలత.....

ఎక్ప్‌పీరియా జే: చుట్టుకొలత 124.3 x 61.2 x 9.2 మిల్లీ మీటర్లు, బరువు 124 గ్రాములు,

లూమియా 800: చుట్టుకొలత 61.2 x 116.5 x 12.1మిల్లీ మీటర్లు, బరువు 142 గ్రాములు,

డిస్‌ప్లే......

ఎక్ప్‌పీరియా జే: 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్, బ్రావియా మొబైల్ ఇంజన్,

లూమియా 800: 3.7 అంగుళాల క్లియర్ బ్లాక్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

ప్రాసెసర్.....

ఎక్ప్‌పీరియా జే: సింగిల్ కోర్ 1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

లూమియా 800: 1.4గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

ఎక్ప్‌పీరియా జే: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

లూమియా 800: విండస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.........

ఎక్ప్‌పీరియా జే: 5మెగా పిక్సల్ రేర్ కెమెరా,

లూమియా 800: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఫీచర్),

స్టోరేజ్........

ఎక్ప్‌పీరియా జే: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

లూమియా 800: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్,

కనెక్టువిటీ......

ఎక్ప్‌పీరియా జే: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,

లూమియా 800: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ.........

ఎక్ప్‌పీరియా జే: 1750ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్ టైమ్- 7.5 గంటలు, స్టాండ్‌బై 25 రోజులు),

లూమియా 800: 1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 9 గంటలు, స్టాండ్‌బై టైమ్ 335 గంటలు),

ధర.........

ఎక్ప్‌పీరియా జే: రూ.16,490.

లూమియా 800: రూ.18,867.

అదనపు ఫీచర్లు......

ఎక్ప్‌పీరియా జే: వన్ టచ్ ఫంక్షన్, కంటెంట్ షేరింగ్, సోనీ మీడియా అప్లికేషన్స్, క్లౌడ్ ఆధారిత డిజిటల్ స్ట్రీమింగ్ మ్యూజిక్ సర్వీస్, 3డీ వ్యూ, 3డీ పానోరమా స్వీప్ మోడ్.

లూమియా 800: నోకియా డ్రైవ్, నోకియా మ్యాప్స్, సిటీ లెన్స్.

తీర్పు......

పెద్దదైన డిస్‌ప్లే, ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ, ఉత్తమ క్వాలిటీ మ్యూజిక్ ఇంకా వీడియో కాలింగ్ ఆప్షన్‌లను కోరుకునే వారికి ఎక్ప్‌పీరియా జే ఉత్తమ ఎంపిక. అలాగే మెరుగైన బ్యాటరీ బ్యాకప్, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా ఇతర ఉచిత సర్వీస్‌లను కోరుకునే వారికి లూమియా 800 బెస్ట్ చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot