త్వరలో ఇండియాకు నోకియా లూమియా 900, గెలాక్సీ ఎస్3ని బీట్ చేస్తుందా..?

Posted By: Prashanth

త్వరలో ఇండియాకు నోకియా లూమియా 900, గెలాక్సీ ఎస్3ని బీట్ చేస్తుందా..?

 

నోకియా నుంచి డిజైన్ కాబడిన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 900’ త్వరలో భారత్‌లో లభ్యంకానుంది. బీజీఆర్ ఇండియా నివేదికల మేరకు లూమియా 900 భారత్‌లో రూ.29,999లకు విక్రయించనున్నారు. వినియోగదారులు ఈ డివైజ్‌ను విండోస్ 7.8 అప్‌డేట్‌తో పొందవచ్చు. ఈ అప్‌డేట్ ద్వారా యూజర్ సరికొత్త కెమెరా ఫీచర్లతో పాటు సరికొత్త హోమ్‌స్ర్కీన్ ఆప్షన్‌లను పొందవచ్చు. లూమియా 900 కీలక ఫీచర్లు....

డిస్‌ప్లే: 4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ ఆమోల్డ్ వివిడ్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, స్ర్కాచ్ రెసిస్టెంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్, బరువు 160 గ్రాములు, చుట్టుకొలత 127.8 x68.5x11.5మి.మీ.

ప్రాసెసర్ ఇంకా ర్యామ్: క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 1.4గిగాహెర్జ్), ఎమ్ఎస్ఎమ్8255టి స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్, అడ్రినో 205 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ).

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 7.8 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: నోకియా సిటీ‌లెన్స్, షాజామ్ తరహా ఆడియో రికగ్నిషన్, టర్న్ బై టర్న్ బింగ్ మ్యాప్స్ నేవిగేషన్, వాయిస్ గైడెన్స్, స్కైడ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, పీడీఎఫ్ సపోర్ట్, మైక్రోసాఫ్ట్ లింక్ సపోర్ట్, యానిమేటెడ్ ఫిక్సర్ టైల్స్, స్కై డ్రైవ్, ఫేస్‌బుక్ సింక్, ఫోటో మేనేజ్‌మెంట్, జూన్ స్మార్ట్డ్ డీజే మల్టీ మీడియా మిక్స్ సపోర్ట్.

కెమెరా: 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, కార్ల్ జిస్ లెన్స్ (3264 x 2448పిక్సల్ రిసల్యూషన్), ఆటోఫోకస్, జియో-ట్యాగింగ్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

స్టోరేజ్: నోకియా లూమియా 900 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వ్యవస్థ లోపించింది.

కనెక్టువిటీ ఆప్షన్‌లు: వై-ఫై 802.11 a/b/g/n, బ్లూటూత్ 2.1+A2DP.

బ్యాటరీ: లియోన్ 1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్‌బై టైమ్ 300 గంటలు, టాక్ టైమ్ 7 గంటలు).

గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot