ఇండియాలో నోకియాకు ఎదురు దెబ్బ..?

Posted By: Prashanth

ఇండియాలో నోకియాకు ఎదురు దెబ్బ..?

 

4జీ ఆధారిత ఎల్‌టీ‌ఈ నెట్‌వర్క్‌ను దేశంలో సుస్థిరంగా నెలకొల్పేందుకు మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ నెట్‌వర్క్ పూర్తి స్ధాయిలో అందుబాటులోకి రావటానికి ఇంకా 6 నెలల సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్‌టీఈ మోడల్ మొబైల్ ఫోన్‌లు ఇండియా వంటి దేశాలకు సరితూగవు.

భారతీయులు విశ్వసించదగిన నెంబర్ 1 మొబైల్ బ్రాండ్ ‘నోకియా’ ఇటీవల నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక పై విండోస్ ఆధారిత ‘లూమియా 900 LTE’ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మొబైల్ విడుదల కావల్సి ఉండగా, ఇండియా తదితర దేశాల్లో ఎల్‌టీ‌ఈ నెట్‌వర్క్‌ అందుబాటులో లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలో నాన్ LTE వర్షన్ విండోస్ ఆధారిత మొబైల్‌ను ప్రవేశపెట్టేందుకు నోకియా సన్నాహాలు చేస్తుంది. నాన్ LTE వర్షన్ ‘నోకియా లూమియా 900’ మోడల్‌లో వస్తున్న ఈ స్మార్ట్ డివైజ్ జూన్ నాటికి గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యం కానుంది. ధర వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* విండోస్ ఆపరేటింగ్ సిస్టం,

* 4.3 అంగుళాల క్లియర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,

* సింగిల్ కోర్ APQ 8055 మొబైల్ ప్రాసెసర్,

* 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే విధంగా MDM9200 చిప్ వ్యవస్థ,

* 14.5 జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot