ఆత్రుతతో ఎదురుచూస్తున్నవారికి..?

Posted By: Super

ఆత్రుతతో ఎదురుచూస్తున్నవారికి..?

 

సమస్త గ్యాడ్జెట్ ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తున్న విండోస్ ఆధారిత ‘నోకియా లూమియా 910’ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్ రిటైలింగ్ సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లభ్యం కానుంది. విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్  రన్ అవుతంది. ప్రాసెసర్ సామర్ధ్యం 1400 MHz (సింగిల్ కోర్).

ఫోన్ డిస్‌ప్లే 4.3 అంగుళాల పరిమాణం కలిగి మల్టీ టచ్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా సామర్ధ్యం 12.1 మెగా పిక్సల్స్ , ముందు భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా సామర్ధ్యం 1.3 మెగా పిక్సల్స్. 512 ఎంబీ ర్యామ్ , జీపీఆర్ఎస్, ఎడ్జ్ వ్యవస్థలను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. వై-ఫై వ్యవస్ద స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. బ్లూటూత్ V3.0, యూఎస్బీ V2.0 మైక్రో యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి.

జీఎస్ఎమ్,యూఎమ్‌టీఎస్ నెట్‌వర్క్‌లను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఉత్తమ క్వాలటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్. ఇన్-బుల్ట్ గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో. బ్యాటరీ స్టాండ్ బై 300 గంటలు. హై స్పీడ్ 4జీ ఎల్‌టీ‌ఈ నెట్‌వర్క్‌ను ఫోన్ సపోర్ట్ చేయ్యదు. ఇందుకు ఇండియాలో నెలకున్న ప్రతికూల పరిస్థితులు కారణం. ఈ ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot