నోకియా లూమియా వచ్చేస్తుందోచ్... ఈ నవంబర్‌లో!

Posted By: Prashanth

నోకియా లూమియా వచ్చేస్తుందోచ్... ఈ నవంబర్‌లో!

 

నమ్మకమైన మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా, తొలి విండోస్ 8 ఫోన్ ‘లూమియా 920’ నవంబర్ నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యంకానుంది. ఈ విడుదలకు సంబంధించి నోకియ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ నవంబర్ లో లూమియా 920ను ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, ఇండియా, ఇటలీ, పోలాండ్, రిష్యా, సౌదీ ఆరేబియా, థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ యమరేట్స్, యూకే, యూఎస్ ఇంకా వియత్నాం ప్రాంతాల్లో విడుదల చేయునున్నారు. తొలి విడదలో భాగంగా లూమియా 920ను యూకే ఇంకా ఫ్రాన్స్ దేశాల్లో విడుదల చేస్తారు. మలి విడతలో భాగంగా తక్కిన దేశాల్లో విడుదల చేస్తారు. దేశీయ విపణిలో ఖచ్చితమైన విడుదలకు సంబంధించి తేదీని నోకియా ఆ ప్రకటనలో వెలువరించలేదు.

నోకియా లూమియా 920:

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ, వై-ఫై, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ), 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోయూఎస్బీ పోర్ట్, శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

ఫోన్‌లన్ని ఒకేచోట!

మొబైల్ కొనుగోలు చేయటానికి డబ్బులుంటే చాలనుకుంటే పొరపాటు. ఉత్తమ మొబైల్ ఎంపిక విషయంలో అవగాహనతో పాటు తులనాత్మక అంచనా తప్పనిసరి. మీరు ఎంపిక చేసుకున్న డివైజ్‌ను అన్ని అంశాల్లో వేరే డివైజ్‌లతో అంచనా వేసి ఓ సమగ్ర మైన అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీకు సహాయపడేందుకు ఆన్‌లైన్ ప్రైస్ కంపారిజన్ ఇంజన్ గోప్రోబో డాట్ కామ్ (goProbo.com) మీ ముందుకొచ్చింది. ఈ సైట్ ద్వారా మీకు నచ్చిన మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌ పట్ల నిశితమైన అవగాహనకు వచ్చి నచ్చిన ధరల్లో సొంతం చేసుకోవచ్చు. కొనుగోలుదారుకు.. ఆన్‌లైన్ రిటైలర్‌కు మధ్య వారధిగా వ్యవహరిస్తున్న గోప్రోబ్ డాట్ కామ్ విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే పొందుపరుస్తుంది. ఈ సైట్‌లోకి ప్రవేశించిన వినియోగదారు అన్ని జాతీయ అంతర్జాతీయ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను స్పెసిఫికేషన్‌లతో సహా తెలుసుకోవచ్చు. ఆయా డివైజ్‌ల పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు అందిస్తున్న ధర రాయితీలను సైతం వినియోగదారు తెలుసుకోవచ్చు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot