ఇండియన్ మార్కెట్లోకి లూమియా 920, 820.. నేటి నుంచి విక్రయాలు

Posted By: Prashanth

ఇండియన్ మార్కెట్లోకి లూమియా 920, 820.. నేటి నుంచి విక్రయాలు

 

అభిమానుల ఎదురుచూపులకు బ్రేకులు వేస్తూ నోకియా అధిక ముగింపు విండోస్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లు లూమియా 920, లూమియా 820 లు నేటి నుంచి రిటైల్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గురువారం న్యూఢిల్లీ, బెంగుళూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో నోకియా ఈ హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఆవిష్కరించబడిన మరో లూమియా సిరీస్ ఫోన్ ‘లూమియా 620’ ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానుంది. మెట్రోపాలిటిన్ నగరాల్లో నేటి నుంచి లూమియా 920, 820 హ్యాండ్‌సెట్‌లు లభ్యమవుతాయి.

సీఈఎస్ 2013లో ‘‘ది బెస్ట్ గాడ్జెట్‌లు’’

ధరలు:

లూమియా 920: రూ.38,199,

లూమియా 820: రూ.27,559,

లూమియా 620: ప్రకటించలేదు.

లూమియా 920 స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డబ్ల్యూఎక్స్‌జీఏ ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్, రిసల్యూషన్1280x 768పిక్సల్స్, క్లియర్ బ్లాక్, సూపర్ సెన్సిటివ్ టచ్ (నెయిల్ ఇంకా గ్లవ్ సపోర్ట్), విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 32జీబి మాస్ మెమరీ, 7జీబి స్కై డ్రైవ్ స్టోరేజ్, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ప్యూర్‌వ్యూ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, హై పవర్ ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హైడెఫినిషన్ 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 3.1, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో), 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కలర్ వేరియంట్స్ (రెడ్, వైట్, ఎల్లో, బ్లాక్, వైట్).

లూమియా 820 స్పెసిఫికేషన్‌లు:

4.3 అంగుళాల వోఎల్ఈడి డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800x 480పిక్సల్స్, సూపర్ సెన్సిటివ్ టచ్, విండోస్ ఫోన్ 8 ఆపరటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి మాస్ మెమరీ, 8 మెగా పిక్సల్ కెమెరా (కార్ల్‌జిస్ ఆప్టిక్స్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 3.1, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో), 1080 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్, బరువు 160 గ్రాములు, చుట్టుకొలత 123.8మిల్లీమీటర్లు x 8.5మిల్లీమీటర్లుx9.9మిల్లీమీటర్లు 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ కలర్ వేరియంట్స్: (రెడ్, ఎల్లో, గ్రే, సియాన్, పర్పిల్, వైట్, బ్లాక్).

లూమియా 620 స్పెసిఫికేషన్ లు:

3.8 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై, బ్లూటూత్, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కలర్ వేరియంట్స్ (ఎల్లో, సియాన్, వైట్, బ్లాక్).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot