లూమియా 920 ఈ నవంబర్‌లో లేనట్లే!

Posted By: Prashanth

లూమియా 920 ఈ నవంబర్‌లో లేనట్లే!

 

నోకియా అభిమానులు ఈ వార్త విని నిరుత్సాహాపడక తప్పదేమో. నోకియా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన విండోస్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ‘లూమియా 920’ తొలత నిశ్చయించిన ప్రకారం ఈ నవంబర్ లో విడుదల కావల్సి ఉంది. అయితే ఈ విడుదల వాయిదా పడినట్లు నోకియా ఇండియా వర్గాలు బీజీఆర్ కు వెల్లడించాయి. ముందస్తు సమస్యలు తలెత్తకుండా లూమియా డివైజ్ లను ఇండియా మొబైల్ క్యారియర్ లతో పరీక్షించిన తరువాతే డివైజ్ ఆవిష్కరణ తేదీని ప్రకటిస్తామని నోకియా ఇండియా స్పష్టం చేసినట్లు సమాచారం. దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అమ్మకాల పరంగా గత కొంత కాలంగా వృద్ధి రేటును సాధించలేకపోతున్న నోకియా ‘లూమియా 920’ పై గంపెడు ఆశలే పెట్టుకుంది. ఈ తాజా నిర్ణయం అమ్మకాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

లూమియా 920 కీలక ఫీచర్లు:

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ,

వై-ఫై,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ),

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,

1జీబి ర్యామ్,

32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోయూఎస్బీ పోర్ట్,

శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

క్యూఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్,

లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot