నోకియా కొత్త ఫీచర్.. వైర్‌లెస్ చార్జింగ్!

Posted By: Staff

 నోకియా కొత్త ఫీచర్.. వైర్‌లెస్ చార్జింగ్!

 

 

స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో సామ్‌సంగ్‌ను అందుకోలేకపోతున్న ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం నోకియా కొత్త ఫీచర్‌తో రాబోతుంది. ప్రముఖ టెక్నాలజీ బ్లాగ్ ది వెర్జ్ (verge) నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ రోజు అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో నిర్వహించనున్న ‘నోకియా వార్షిక కార్యక్రమంలో’ నోకియా తన లూమియా మరో సరికొత్త వర్షన్ ఫోన్  ‘లూమియా 920’ను  ఆవిష్కరించబోతోంది. విండోస్8 ఆధారితంగా స్పందించే ఈ హ్యాండ్‌సెట్‌కు వైర్‌లెస్ బ్యాటరీ చార్జింగ్ సదుపాయాన్ని జతచేసినట్లు వెర్జ్ తన బ్లాగ్‌‌లో పేర్కొంది.  ఇండక్టివ్ విధానంతో పనిచేసే ఒక చార్జింగ్ ప్యాడ్ ద్వారా లూమియా 920 బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని సదరు బ్లాగ్ వెల్లడించింది.  ప్యాడ్ మీదనున్న చార్జింగ్ కాంటాక్స్‌పై హ్యాండ్‌సెట్‌ను ఉంచితే చాలు, బ్యాటరీ చార్జ్ అవటం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరో స్మార్ట్‌ఫోన్ లూమియా 820  మైక్రోసాఫ్ట్, నోకియాలు ఆవిష్కరించే అవకాశముందని నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే, ఈ ఫోన్‌లు నవంబర్ లేదా డిసెంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.

ఫీచర్లు:

4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

క్యూఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్,

1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

1జీబి ర్యామ్,

32జీబి ఎక్సటర్నల్ మెమరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot