అదిరిందయ్యా చంద్రం... నోకియా Vs సామ్‌సంగ్!

Posted By: Super

అదిరిందయ్యా చంద్రం... నోకియా Vs సామ్‌సంగ్!

నోకియా, సామ్‌సంగ్‌ల మధ్య స్మార్ట్‌ఫోన్‌ల యుద్ధం నెలకుంది... మేలో విడుదలలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, నవంబర్‌లో విడుదల కాబోతున్న నోకియా లూమియా 920ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభం కానుంది.. ఆండ్రాయిడ్, విండోస్‌లు మధ్య నెలకున్న ఈ ‘బిగ్‌ఫైట్’లో విన్నర్ ఎవరు..?, ఈ ప్రశ్నలకు సమాధానాన్ని శోధించే ప్రయత్నంగా రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌లను ఓ సారి చూద్దాం...

డిస్‌ప్లే ఇంకా డైమెన్షన్:

లూమియా 920: బరువు 185 గ్రాములు, చుట్టుకొలత 130.3 x 70.8 x 10.7మిల్లీమీటర్లు, 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (ప్య్యూర్ మోషన్ హైడెఫినిషన్ టెక్నాలజీ), టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్.

గెలాక్సీ ఎస్3: బరువు 133 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 70.6 x 8.6మిల్లీమీటర్లు, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్.

ప్రాసెసర్:

లూమియా 920: క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960 స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్, డ్యూయల్ కోర్ 1.5గిగాహెర్జ్ క్రెయిట్ ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

గెలాక్సీ ఎస్ 3: ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్, క్వాడ్‌కోర్ 1.4 గిగాహెర్జ్ ఏ9 ప్రాసెసర్, మాలీ 400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

ఆపరేటింగ్ సిస్టం:

లూమియా 920: సరికొత్త విండోస్ విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

గెలాక్సీ ఎస్3 : ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్),

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టిం ప్రత్యేకతలు: డైనమిక్ లైవ్ టైల్ ఇన్ఫర్మేషన్, ట్విట్టర్ అండ్ లింకిడిన్ ఇంటిగ్రేషన్, ఫేస్‌బుక్ ఈవెంట్స్, త్రెడ్ ఈ-మెయిల్ కన్వర్జేషన్ , విజువల్ వాయిస్ మెయిల్, అవుట్ లుక్ టాస్క్, ఆడియో రికగ్నిషన్, టర్న్ బై టర్న్ బింగ్ మ్యాప్స్ నావిగేషన్, వాయిస్ గైడెన్స్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, పీడీఎఫ్ సపోర్ట్, మైక్రోసాఫ్ట్ లింక్ సపోర్ట్, యానిమేటెడ్ పిక్చర్ టైల్స్.....

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, వేగవంతమైన పనితీరు,ఆన్-స్ర్కీన్ నావిగేషన్ బటన్స్, అపడేటెడ్ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్, అప్‌డేటెడ్ ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్.....

కెమెరా:

లూమియా 920: 8.7 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ప్యూర్ వ్యూ కెమెరా టెక్నాలజీ , ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

గెలాక్సీ ఎస్3: 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

స్టోరేజ్:

లూమియా 920: 32జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్.

గెలాక్సీ ఎస్3: 16జీబి, 32జీబి, 64జీబి మెమరీ వేరియంట్స్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్.

కనెక్టువిటీ:

లూమియా 920: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్ఎస్‌యూపీఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై 802.11a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్, ఏ2డీపీ, ఈడీఆర్, మైక్రోయూఎస్బీ 2.0.

గెలాక్సీ ఎస్3: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్ఎస్‌యూపీఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై 802.11a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్, ఏ2డీపీ, ఈడీఆర్, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ:

లూమియా 920: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (10 గంటల టాక్‌టైమ్, 400 గంటల స్టాండ్‌బై),

గెలాక్సీ ఎస్3: 2,100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (11.5 గంటల టాక్‌టైమ్, 790 గంటల స్టాండ్‌బై),

తీర్పు:

కెమెరా విభాగానికి వస్తే లూమియా 920 రేర్ విభాగంలో, గెలాక్సీ ఎస్3 ఫ్రంట్ విభాగంలో ముందజలో ఉన్నాయి. అనేక అప్లికేషన్‌లను ఈ స్మార్ట్‌ఫోన్‌లు సపోర్ట్ చేస్తున్నాయి. పూర్తి స్థాయి ఆండ్రాయిడ్ రుచులను ఆస్వాదించాలనుకునేవారికి గెలాక్సీ ఎస్3 ఉత్తమ ఎంపిక. అదేవిధంగా విండోస్ 8 రుచులను ఆస్వాదించాలనుకునేవారికి లూమియా 920 బెస్ట్ ఛాయిస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot