విశ్వసనీయ బ్రాండ్ నోకియా ఇటీవల ఆవిష్కరించిన విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లు లూమియా 810, లూమియా 920 విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకుంది. ఈ ఫోన్‌లలోని ప్రత్యేక ఫీచర్లలో ఒకటైన ‘వైర్‌లెస్ చార్జింగ్’ పలువురికి వరంలా మారింది. ముఖ్యంగా తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్ చార్జింగ్ అవసరాలను తీరస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపగించుకునేందుకు అవసరమైన వైర్‌లెస్ ఉపకరణాలను నోకియా ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ ఉపకరణాల ధరలకు సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రముఖ యూకే బ్లాగ్‌సైట్ బహిర్గతం చేసింది. ఆ బ్లాగ్ ప్రచురించిన పోస్ట్ ఆధారంగా లూమియా సిరీస్ ఫోన్‌ల కోసం నోకియా డిజైన్ చేసిన వైర్‌లెస్ చార్జింగ్ ఉపకరణాల ధరల వివరాలు....
వైర్‌లెస్ చార్జింగ్ స్టాండ్ - £69.99 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.5,930),
వైర్‌లెస్ చార్జింగ్ షెల్ - £19.99 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,700),
చార్జింగ్ ప్లేట్ - £54.99 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.4,660),
వైర్‌లెస్ చార్జింగ్ పిల్లో బై ఫాట్‌బాయ్ - £79.99 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.6,775),
నోకియా జేబీఎల్ పోర్టబుల్ వైర్‌లెస్ స్సీకర్ - £144.99 ( ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.12,300)
(సమాచారం మూలం: Clove.co.uk)
లూమియా 920 కీలక ఫీచర్లు:
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ, వై-ఫై, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ), 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోయూఎస్బీ పోర్ట్, శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.