మీది నోకియా ఫోనా.. మిస్ కావద్దు!!

Posted By: Prashanth

మీది నోకియా ఫోనా.. మిస్ కావద్దు!!

 

బార్సిలోనాలో కన్నుల పండుగగా నిర్వహిస్తున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సాక్షిగా నోకియా తమ వినియోగదారులు, శ్రేయోభిలాషుల కోసం కొత్త సర్వీస్‌లను ప్రకటించింది. ఈ దిగ్గజ బ్రాండ్ ఆవిష్కరించిన నోకియా లైఫ్‌టూల్స్, రీడింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, డ్రైవ్ అండ్ మ్యాప్స్ అప్లికేషన్‌లు వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుస్తాయి. వీటిలో మొదటిదైన నోకియా లైఫ్ టూల్స్‌ను తొట్ట తొలతగా 2009లో విడుదలైన నోకియా ఎంట్రీ లెవల్ సింబియాన్ ఫోన్‌లలో ప్రవేశపెట్టారు. వివిధ రంగాలకు సంబంధించిన చిట్కాలను ఈ సర్వీస్ ద్వారా పొందవచ్చు. ఈ అప్లికేషన్‌ను మరింత అప్‌డేట్ చేసేన నేపధ్యంలో విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య విభాగాలకు సంబంధించిన సమచారాన్ని ఆ రంగాల్లోని నిపుణుల ద్వారా తెలసుకునే సౌలభ్యతను ఈ లైఫ్ టూల్ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు.

మరో అప్లికేషన్ ‘నోకియా రీడింగ్’ను ప్రత్యేకించి లూమియా సిరీస్ ఫోన్‌ల కోసం రూపొందించారు. ఈ అప్లికేషన్ ద్వారా వినియోగదారుడు పుస్తకాలను ఆడియో, వీడియో రూపంలో ఫోన్ తెర పై ఆస్వాదించవచ్చు. ప్రాంతీయ బాషతో నిండిన పుస్తకాలు సైతం ఈ అప్లికేషన్‌లో దొరుకుతాయి.

మరో అప్లికేషన్ ‘నోకియా ప్లబిక్ ట్రాన్స్‌పోర్ట్’, ఈ అప్లికేషన్ ద్వారా ఆయా ప్రాంతాల్లోని గమ్య స్థానాలకు సులువుగా చేరవచ్చు. రూట్ మ్యాప్ వ్యవస్థను ఈ అప్లికేషన్‌లో మరింత పటిష్టం చేశారు. ఈ సిర్వీస్‌ను వినియోగించడం ద్వారా సమయాన్ని మరింత ఆదా చేసుకోవచ్చు. నోకియా ఆవిష్కరించిన మరో అప్లికేషన్ ‘నోకియా మ్యాప్స్’ ఇదివరకే ఈ సర్వీస్ ఉన్నప్పటికి సూపర్ జూమింగ్ క్వాలిటీతో దీన్ని 3.0 వర్షన్‌కి అప్‌డేట్ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot