నోకియా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు !

Written By:

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నోకియా అభిమానుల కోసం 4 రోజుల పాటు నోకియా మొబైల్‌ వీక్‌ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన నోకియా ఫోన్లపై పలు రకాల ఆఫర్లను అందిస్తోంది. దీంతో పాటు మరికొన్ని రకాల నోకియా ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. నోకియా 6, నోకియా 8 లాంటి ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి..ఆఫర్లపై ఓ లుక్కేయండి.

మిజు నుంచి దూసుకొస్తున్న Meizu S6,ఈ నెల 17న ముహూర్తం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 6

అసలు ధర రూ.14,999
తగ్గింపు రూ.1500
కొనుగోలు ధర రూ.13,499

నోకియా 8

అసలు ధర రూ.36,999
తగ్గింపు రూ.1500
కొనుగోలు ధర రూ.35,499

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో..

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1500 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ అందుబాటులోకి రావాలంటే, కార్డుపై రూ.10వేల వరకు కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుపై ఒక్కసారి మాత్రమే ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

అమెజాన్‌ పే వాడి కొనుగోలు చేస్తే..

నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ పే వాడి కొనుగోలు చేస్తే, ఆ యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. అయితే అమేజింగ్‌ మొబైల్స్‌ లేదా గ్రీన్‌ మొబైల్స్‌లో మాత్రమే కొనుగోలు జరపాల్సి ఉంటుంది.

ఎక్స్చేంజ్‌ ఆఫర్‌లో ..

ఎక్స్చేంజ్‌ ఆఫర్‌లో నోకియా 6ను కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్‌ను కూడా అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. అంటే మొత్తంగా ఇరు స్మార్ట్‌ఫోన్లపై రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభించనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia Mobile Week: Nokia 6, Nokia 8 available at Rs 1,500 discount on Amazon India, cashbacks and more Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot