‘నోకియా ఎన్10’ పనితీరులో పెద్దన్న!!!

Posted By: Super

‘నోకియా ఎన్10’ పనితీరులో పెద్దన్న!!!

 

అంతర్జాతీయ బ్రాండ్ నోకియా (Nokia) ఇండియన్ మార్కెట్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  ‘N’ సిరీస్ మొబైల్ ఫోన్లు ఊహించని స్థాయిలో విజయవంతం కావటంతో  బ్రాండ్ రెట్టింపు ఉత్సాహంతో ఉంది. ఈ సిరీస్‌లో మరో కొత్త మొబైల్‌ను విడుదల చేసేందుకు నోకియా రంగం సిద్ధం చేసింది. ‘నోకియా ఎన్10’ వర్షన్‌లో డిజైన్ కాబడిన ఈ సరికొత్త ఫోన్ ‘నోకియా మీగో ఆపరేటింగ్ సిస్టం’ (Nokia Meego operating system) పై రన్ అవుతుంది. మరిన్ని ఫీచర్లు:

స్లైడింగ్ క్వర్టీ కీబోర్డ్ . డిస్‌‌ప్లే 5 సెంటీ మీటర్లు, డివైజ్ ఇంటర్నల్ మెమరీ 256 ఎంబీ, ఎక్స్ ప్యాండబుల్ విధానం ద్వారా 32జీబికి పెంచుకోవచ్చు. లితియమ్ ఇయాన్ బ్యాటరీ వ్యవస్థ  మన్నికైన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.  ఎంపీ4 ప్లేయర్, ఎంపీత్రీ ప్లేయర్, డ్యూయల్ స్పీకర్స్, 3.5mm ఆడియో జాక్, ఇన్‌బుల్ట్ గేమ్స్, 12 మెగా పిక్సల్ కెమెరా,  Xenon ఫ్లాష్ సౌలభ్యత.

‘మిగా ఆపరేటింగ్ వ్యవస్థ’ను  నోకియా, ఇంటెల్ సంస్థలను సంయుక్తంగా వృద్థి చేశాయి. టచ్ స్ర్కీన్ ఆధారితంగా ఈ మొబైల్ పని చేస్తుంది. క్వర్టీ కీ బోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు దోహదపడుతుంది.  నిక్షిప్తం చేసిన 12 మెగా పిక్సల్  హై క్వాలిటీ కెమెరా నాణ్యమైన చిత్రాలను అందిస్తుంది. మొబైల్‌లో పొందుపరిచన హై క్వాలిటీ మల్టీ మీడియా ప్లేయర్ వినోదాన్ని నిరంతరాయంగా పంచుతుంది.

బిగ్ స్ర్కీన్ పై వీడియోలు చూసిని  మైమరపుకు శ్రోతకు లోనవుతాడు. ఏర్పాటు చేసిన డ్యూయల్ స్పీకర్ వ్యవస్థ మై క్వాలిటీ సౌండ్‌ను విడుదల చేస్తుంది. పుష్ ఇ-మెయిల్ ఆప్షన్‌తో పాటు పలు సోషెల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్లను ఫోన్లో ముందుగానే ఇన్‌బుల్ట్ చేశారు. ఫోన్ ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot