అన్నా ఓఎస్ అప్‌గ్రేడ్‌తో మార్కెట్లో మంచి డిమాండ్

Posted By: Staff

అన్నా ఓఎస్ అప్‌గ్రేడ్‌తో మార్కెట్లో మంచి డిమాండ్

నోకియా ఎన్ సిరిస్ మొబైల్ లలో కెల్లా చూడడానికి చాలా అందంగా ఉండేటటువంటి మొబైల్ ఫోన్ నోకియా ఎన్8. అత్యాధునికమైన ఫీచర్స్‌తో కస్టమర్స్‌ని ఇట్టే ఆకట్టుకునేటటువంటి గుణం దీనిది. నోకియా ఎన్8 ఇప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో సూపర్ ఫెర్పామెన్స్‌ని ప్రదర్శించడానికి వస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఉన్న మొబైల్ రంగంలో మల్టీమీడియా స్మార్ట్ ఫోన్స్‌లలో తన కంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో నోకియా విడుదల చేసిన అన్ని మొబైల్స్‌లలో సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపోందించడం జరిగింది. ఐతే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో విడుదలతున్న ఆండ్రాయిడ్, బడా లాంటి ఆపరేటింగ్ సిస్టమ్‌ల నుండి కాంపిటేషన్ తట్టుకునేందుకుగాను నోకియా తన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో అప్ గ్రేడ్ చేయనుంది. ముఖ్యంగా నోకియా హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ అయిన ఎన్ సిరిస్ మొబైల్స్‌లలో సింబియన్ అన్నాతో అప్ గ్రేడ్ చేయనున్నారు.

సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల చాలా కొత్త కొత్త మార్పులు నోకియా ఎన్8లో సంతరించుకోనున్నాయి. ముఖ్యంగా అన్నా ఓఎస్ వల్ల బ్రౌజర్ ఫెర్పామెన్స్ పెరిగి యాజర్‌కు చక్కని టైమ్ సేవింగ్‌తో పాటు మొబైల్ ఎఫిసియన్సీ కూడా వేగంగా ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ రూట్స్‌ని చాలా వేగ వంతంగా చూసేందుకు ఓవిఐ మ్యాప్స్ ఉపయోగపడతాయి. 720 ఫిక్సల్ వీడియో ఫార్మెట్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇక నోకియా ఎన్8 విషయానికి వస్తే స్మార్ట్ పోన్స్ రంగంలో పెద్ద సక్సెస్‌ని సాధించిన మొబైల్ ఫోన్. ఇప్పుడు దీనియొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ చేయడం వల్ల మొబైల్ ఫెర్పామెన్స్ కూడా ఫాస్టుగా ఉంటుంది.

3.5 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, 12 మెగా పిక్సల్ కెమెరాతో చక్కని ఇమేజిలను తీసేందుకు వీలుగా ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేయడం జరిగింది. నోకియా ఎన్8 విడుదలైనప్పటి నుండి కూడా నోకియా కంపెనీకి మంచి బిజినెస్‌ని అందిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా నోకియా ఎన్8లో సింబియన్ ఓఎస్ అప్ గ్రేడ్ రూపోందిచడంతో మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ ఏర్పడడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot