సీక్వెల్స్ సినిమాలకే కాదు 'నోకియా మొబైల్స్‌'కు కూడా..

By Prashanth
|
Nokia N8


నోకియా ఎన్8 మార్కెట్లో ఎంత పెద్ద సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పడు కొత్తగా నోకియా ఎన్8కి సీక్వెల్ మొబైల్‌ని రూపొందిచాలని నోకియా టెక్నాలజీ ప్రతినిధులు ఆలోచిస్తున్నారు. అంతేకాదండోయ్ ఈ మొబైల్‌ని 2012, Q2లో విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో విడుదల చేసిన నోకియా ఎన్8 మొబైల్‌కి 2012లో రానున్న నోకియా ఎన్8 మొబైల్‌కి మద్య ఉన్న పెద్ద తేడా ఏంటంటే ఆప్టికల్ జూమ్ ఫీచర్. ఎప్పటి నుండో నోకియా అభిమానులు కొరుకుంటున్నట్లే నోకియా ఎన్8లో ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ని ప్రవేశపెట్టనుంది. నోకియా విడుదల చేయనున్న మొబైల్ పేరు 'నోకియా 801'.

 

ఐతే కెమెరా రిజల్యూషన్‌ని సంబంధించి ఎటువంటి సమాచారం ఇంకా మార్కెట్లోకి వెలువడ లేదు. 12మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండనుందని సమాచారం. నోకియా ఎన్8 సీక్వెల్ మొబైల్ ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే 1 GHz ప్రాససెర్, 512 MB RAMతో పాటు యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 3.5 ఇంచ్‌గా ఉండనుంది.

 

నోకియా ఎన్ 8 మొబైల్ సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్న మాదిరే నోకియా ఎన్ 8 సీక్వెల్ కూడా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుండడం విశేషం. నోకియా ఎన్8 3.5 ఇంచ్ స్క్రీన్‌తో పాటు నోకియా ఎన్8 స్క్రీన్ డైమన్షన్స్ 360* 640 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. నోకియా ఎన్8 మొబైల్ మెసేజింగ్ ఫీచర్స్(ఎస్ఎమ్‌ఎస్, మెయిలింగ్ ఫెసిలిటీ) కలిగి ఉన్నాయి. SMS, MMS, POP MAIL లాంటి ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తాయి. నోకియా ఎన్8 12మెగా ఫిక్సల్ కెమెరా తోపాటు ఆటో ఫోకస్, జినాన్ ఫ్లాష్ సౌకర్యాలను కలిగి ఉంది. నోకియా ఎన్8 మొబైల్ వీడియో రికార్డింగ్‌ని సపోర్ట్ చేస్తుంది.

ఇక మల్టీమీడియా ఫీచర్స్ విషయానికి వస్తే నోకియా ఎన్8 అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌ని కలిగి ఉంది. నోకియా ఎన్8 ఎప్ఎమ్ రేడియో, ఎఫ్ఎమ్ ట్రాన్సిమీటర్ పొందుపరచడం జరిగింది. మొమొరీని 32జిబి వరకు ఎక్సాండబుల్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే నోకియా ఎన్8 మొబైల్ EDGE, GPRS ఫెసిలిటీని కలిగి ఉన్నాయి. వైర్ లెస్ ఇంటర్నెట్ కోసం రెండు మొబైల్స్ కూడా WLAN ఫెసిలిటీని కలిగి ఉన్నాయి. నోకియా ఎన్8 బ్లూటూత్ 3 వర్సన్‌ని సపోర్ట్ చేస్తుంది.ఖరీదు విషయానికి వస్తే నోకియా ఎన్8 ధర కేవలం రూ 22,000గా నిర్ణయించడమైంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X