'నోకియా ఎన్9' అప్ గ్రేడ్ సమాచారం

By Super
|
Nokia N9


నోకియా 'మీగో' ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొట్టమొదటి నోకియా డివైజ్ 'నోకియా ఎన్9' మార్కెట్లో గొప్ప సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. నోకియా ఎన్9 మొబైల్ మార్కెట్లో సక్సెస్ సాధించడానికి కారణం అందులో ఉన్న కెమెరా కార్ల్ జీజ్ ఆప్టిక్స్. నోకియా ఎన్9 మొబైల్‌తో ఫోటోలను తీసినంత అందంగా మరే ఇతర మొబైల్ ఫోన్‌తో తీయలేయం. నోకియా మొబైల్స్‌ని కస్టమర్స్‌కి అమ్మిన తర్వాత, మొబైల్‌కి సంబంధించిన కేర్ ని కూడా 'నోకియా కేర్' ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.

నోకియా ఎన్9 మొబైల్ కొసం గతంలో నోకియా PR1.1 అప్ గ్రేడ్‌ విడుదల చేయడం జరిగింది. ఐతే ఇప్పడు కొత్తగా నోకియా మొబైల్ కంపెనీ నోకియా ఎన్9 కొసం మార్కెట్లోకి PR1.2ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. PR1.1 అప్ గ్రేడ్‌ని ఎవరైతే నోకియా ఎన్9 మొబైల్స్‌ని వాడుతున్నారో వారు అప్ గ్రేడ్ చేసుకొవాల్సిందిగా నోకియా కొరడం జరిగింది. ఈ అప్ గ్రేడ్ చేసుకొవడం వల్ల యూజర్స్ కలర్ స్క్రీమ్స్‌ని పొందడం జరుగుతుంది.

దాంతో నోకియా ఎన్9 మొబైల్ బటన్స్‌ని చూసేందుకు అందంగా ఉంటాయి. కెమెరాలో ఉన్న ఫ్లాష్‌ని కంట్రోల్ చేసేందుకు గాను ఇందులో ఆఫ్షన్స్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. వీడియో రికార్డింగ్ కొసం వీడియో లైట్ కంట్రోల్ ఆఫ్షన్‌ మాత్రం గతంలో మాదిరే పని చేస్తుంది. PR1.1కి PR1.2 మద్య ఉన్న గల వ్యత్యాసం PR1.2లో ఫేస్ రికగ్మనైజేషన్ ఫీచర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ ఫీచర్ సహాయంతో గ్యాలరీలో ఉన్న ఇమేజిలకు మాన్యువల్‌గా ఫేసేస్‌ని మార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది.

నోకియా ఎన్9 మొబైల్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు

సైజు: 116.45 x 61.2 x 7.6-12.1 mm

బరువు: 135 g

మెమరీ

ఇంటర్నల్ మెమరీ: 16 GB or 64 GB

సాప్ట్‌వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: MeeGo for Nokia N9 (MeeGo 1.2 Harmattan)

కెమెరా

8 megapixel camera with Carl Zeiss optics

Dual LED flash

Digital shutter

Continuous autofocus

Touch-to-focus and exposure lock

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X