నోకియా N9 - బ్లాక్ బెర్రీ 9900 (దొందు..దొందే)..!!

Posted By: Super

నోకియా N9 - బ్లాక్ బెర్రీ 9900 (దొందు..దొందే)..!!

ఓ బ్రాండ్ మొబైల్ సెప్టంబర్‌లో విడుదలయ్యేందుకు ఉవ్విల్లూరుతుంటే.. మరో బ్రాండ్ మొబైల్ ఈ ఏడాది చివర్లో మార్కెట్ గడప తొక్కేందుకు మెరుగులు దిద్దుకుంటుంది. రెండు అత్యుత్తమ బ్రాండ్లే.. ఒకదానిని మించినది మరొకటి.. వీటి విడుదల మాట పక్కనపెడితే.. అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఊపందుకున్నాయి. తమ విశ్వసనీయతతో వినియోగదారుల ఆదరణను చొరగున్న ఈ బ్రాండ్లలో ఒకటి నోకియా (Nokia) అయితే మరొకటి బ్లాక్ బెర్రీ (Blackberry).

సామర్థ్యం గల ‘అమోల్డ్’ టచ్‌స్ర్ర్కీన్ వ్యవస్థతో నోకియా విడుదల చేయుబోతున్న సరికొత్త మొబైల్ పేరు నోకియా N9. టీఎఫ్టీ (TFT) సామర్ధ్యం గల టచ్‌స్ర్కీన్‌తో బ్లాక్ బెర్రీ విడుదల చేయుబోతున్నసరికొత్త మొబైల్ పేరు ‘బ్లాక్‌బెర్రీ 9900’. ఇంచు మించుగా ఒకే పోలిక కలిగి ఉన్న వీటి ఫీచర్లు వినియోగదారునికి మరింత లాభదాయకం.

‘క్వర్టీ’ కీబోర్డు స్వభావం కలిగిన ‘బ్లాక్ బెర్రీ 9900’, టచ్ సెన్సిటివ్ కంట్రోల్‌తో పని చేస్తుంది. ఇక స్ర్కీన్ విషయానికి వస్తే 2.8 అంగుళాల డిస్‌ప్లే 640 X 480 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. ఇక ‘నోకియా N9’ విషయానికొస్తే 3.9 అంగుళాల స్ర్కీన్ సైజుతో 480 X 854 పిక్సల్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఇక డేటా స్టోరేజ్ విషయానికి వస్తే ‘బ్లాక్ బెర్రీ 9900’ శక్తివంతమైన ఎడ్జ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. ఈ మొబైల్‌‌లో పొందుపరిచిన 3జీ వ్యవస్థ 14.4Mbps స్పీడ్ రేటు కలిగి ఉంటుంది. ఇక వై - ఫై, బ్లూటూత్ v2.1 వంటి అంశాలు రెండు మొబైళ్లలోనూ ఒకే స్ధాయిని కలిగి ఉంటాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే ‘నోకియా N9’ శక్తివంతమైన 8మెగా పిక్సల్ కెమెరా సామర్ధ్యం కలిగి ఉండగా, బ్లాక్ బెర్రీ మాత్రం 5 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంది. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలను పరిశీలిస్తే ‘నోకియా N9’లో గేమింగ్ వ్యవస్థను మరింత వృద్ధి చేశారు. ఈ మొబైల్‌లో ముందుగానే లోడ్ చేసిన ఆటలు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

ఇక బ్లాక్ బెర్రీలో పొందుపరిచిన పలు అప్లికేషన్లు వ్యాపార వేత్తలకు మరింత అనువుగా ఉంటాయి. ఈ మొబైల్లో పొందుపరిచిన అత్యాధునిక సాఫ్ట్ వేర్ ఫీచర్లు వినియోగదారుడికి యూజర్ ఫ్రెండ్లీలా సహకరిస్తాయి. ‘బ్లాక్ బెర్రీ 9900’ను ఈ సెప్టంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నప్పటికి ధర విషయం మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతున్న నోకియా N9 ధర మాత్రం రూ.35000 ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot