ఆనాడు వై.ఎస్ ‘100’, ‘101’ సేవలు ప్రవేశ పెడితే.. ‘ఈనాడు’..!!

Posted By: Super

ఆనాడు వై.ఎస్ ‘100’, ‘101’ సేవలు ప్రవేశ పెడితే.. ‘ఈనాడు’..!!

"ఆనాడు సామన్య మధ్య తరగతి ప్రజల కోసం వై.ఎస్ ‘100’, ‘101’ సేవలను ప్రవేశపెడితే, ఈనాడు ‘నోకియా’ సామాన్య మధ్య తరగతి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ‘100’, ‘101’ ప్రవేశపెట్టనుంది. వీటి ఫీచర్లను పరిశీలిస్తే.... ’’

గత కొంత కాలంగా ఉన్నత వర్గాలకే పరిమితమైన ‘నోకియా’ సామాన్య ప్రజలకు చేరువయ్యే పనిలో పడింది. తక్కవు ధరలో సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు దృష్టిసారించింది. తాజాగా నోకియా ప్రతినిధి విడుదలు చేసిన ప్రకటనలో ఈ మొబైల్ ఫోన్లకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. తక్కువ ధరతో నాణ్యమైన ఫోన్లను ఎంపిక చేసుకునే వారికోసం తాము నోకియా 101, 100 పేరుతో రెండు మోడళ్లను ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.

తక్కువ ఖరీదు చేసే ఈ ఫోన్లలో ‘సరీస్ 30’ ఆపరేటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం విశేషం. సంగీత ప్రియులకు ఈ ఫోన్ గొప్ప వరమని చెప్పొచ్పు... ఈ ఫోన్లలో పొందుపరిచిన మ్యూజిక్ ప్లేయర్ వ్యవస్థ సుమదుర సంగీతాన్ని నాణ్యమైన కోణంలో మీకు అందిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ , మెమరీ బ్యాకప్ వంటి అంశాలు వినియోగదారులకు మరింత లబ్ధిని చేకూరుస్తాయి. నోకియా ‘101’లో మెమరీ సామర్ధ్యం 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే అమర్చిన లయోన్ 850 (mAh)బ్యాటరీ ఛార్జింగ్ 840 గంటల పాటు నిలిచి ఉంటుంది. మీరు నిరంతరాయంగా 7 గంటల 20 నిమిషాలు పాటు మాట్లాడుకోవచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత చేరువ చేస్తు ఎఫ్.ఎమ రేడియాను ఈ సెట్లలో పొందుపరిచారు.

గ్రామీణ ప్రాంతాల్లో తరచు చోటుచేసుకునే విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్లలో ప్రత్యేక ఫ్లాష్ లైట్ ను పొందుపరిచారు. ఈ ఫోన్ల బరువు కేవలం 69.6 గ్రాములు మాత్రమే ఉంటుంది. ధరలు విషయానికి వస్తే నోకియా ‘100’ మార్కెట్ ధర రూ.1,500 ఉండగా, నోకియా ‘101’ ధర రూ.2000 ఉంది. తక్కువ ధరలో కలర్ డిస్ ప్లే, మ్యూజిక్ ప్లేయర్, హై మెమరీ, శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ కలిగిన ఈ ఫోన్లు వినియోగదారుడికి ఉపయుక్తంగా నిలుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot