భారత్‌ మార్కెట్లో నోకియాదే హవా

Posted By: Super

భారత్‌ మార్కెట్లో నోకియాదే హవా

ఇండియన్ మొబైల్‌ మార్కెట్లో నోకియా గట్టి పోటీ ఎదుర్కుంటున్నప్పటికీ భారతీయ వినియోగదారుల్లో ఇప్పటికీ ఇదే నెంబర్‌ 1 బ్రాండ్‌ అని ఒక సర్వేలో తేలింది. మొత్తం 25 ఆకర్షణీయమైన మొబైల్‌ ఫోన్లలో నోకియా కు చెందిన 12 హేండ్‌సెట్‌లను ఆన్‌లైన్‌ వినియోగదారులు వీక్షించారని సర్వే వెల్లడించింది. రెండవ స్థానంలో స్యాంసంగ్‌ దక్కించుకుంది. దీనికి చెందిన ఆరు మోడల్స్‌ వీటిలో సీడీఎంఏ మోడల్స్‌ మోడల్స్‌ వినియోగదా రులను బాగా ఆకర్షించాయి. మైక్రోమాక్స్‌, సోని ఎరిక్సన్‌లు మూడో స్థా నాన్ని దక్కించుకోగా డెల్‌, హెచ్‌టీసీ, ఐ ఫోనులు 25 అత్యంత ఆకర్షణీ యమైన మొబైల్‌ హెండ్‌ సెట్‌ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

నోకియా సీ5-03, దీని ధర రూ.8,600 ఈ హెండ్‌సెట్‌ను ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. తర్వాత స్థానం నోకియా సీ6 రూ.12,200 రెండవస్థానం, తర్వాత స్థానం కూడా నోకియాదే నోకియా ఎక్స్‌7 దీని ధర రూ.18,000. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎసీఎస్‌ 5830 మోడల్‌ ధర రూ.14,700 నాల్గవ స్థానంలో తర్వాత మళ్లీ నోకియా ఎక్స్‌-3-02 రూ.7,500 దక్కించుకుంది. ఈ జాబితాలో నోకియా, శ్యామ్‌సంగ్‌, మైక్రోమాక్స్‌ తర్వాత అంతర్జాతీయ బ్రాండ్‌లు దక్కించుకున్నాయి. మొత్తం 25 మొటైల్‌ టెలిఫోన్‌ జాబితో ఈ మూడు కంపెనీలు తప్పితే మిగతా ఫోన్ల జాడ లేదు. భారతీయ కొనుగోలు దారులు చౌకరంగ మొబైల్‌ఫోన్లు కొను గోలు చేసేందుకు ఇష్టపడతారు. అంతే కాకుండా ధరలను ఆన్‌లైన్‌ కంటే డీలర్ల నుంచి సమాచారం తెలుసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారని ఈ సర్వే వల్ల తెలిసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot