'హమ్ తుమ్ అప్లికేషన్' ద్వారా నోకియాలో ఎడ్యుకేషన్ సమాచారం..

Posted By: Staff

'హమ్ తుమ్ అప్లికేషన్' ద్వారా నోకియాలో ఎడ్యుకేషన్ సమాచారం..

ఇండియాలో నోకియా మొబైల్స్‌‌కి ఉన్న క్రేజి అంతా ఇంతా కాదు. అతి తక్కువ సమయంలో ఇండియన్స్ మనసులను కొల్లగొట్టిన మొబైల్ తయారీదారుగా నోకియాని అభివర్ణించవచ్చు. అలాంటి నోకియా కంపెనీతో మొబైల్ ఆధారిత ఎడ్యుకేషన్ సర్వీస్‌ అందించే కంపెనీ 'ఎడ్ సర్వ్' నోకియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని నోకియా మొబైల్ పోన్స్‌లలో 'ఎడ్ సర్వ్' ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కంటెంట్‌ని యూజర్స్ కి అందుబాటులోకి తేనుంది.

ఈ సందర్బంలో ఎడ్ సర్వ్ సిఈవో ఎస్ గిరిధరన్ మాట్లాడుతూ మేము రూపొందించినటువంటి 'హమ్ తుమ్ అప్లికేషన్‌'ని నోకియా కంపెనీ నోకియా ఓవిఐ అప్లికేషన్స్‌ స్టోర్‌లో యూజర్స్‌కు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకొనుందని తెలిపారు. నోకియా ఓవిఐ అప్లికేషన్స్‌లో ఉన్న ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌ ని యూజర్స్ నోకియా స్మార్ట్ ఫోన్స్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నోకియాతో ఈ బంధాన్ని ధృడపరచుకొవడంతో ముఖ్యంగా స్డూడెంట్స్ లభ్దిపొందడం జరుగుతుంది. ఇందులో స్టూడెంట్స్ కొసం ఎక్కువ మొత్తంలో చదువుకి సంబంధించిన డాక్యుమెంట్స్, స్క్రిల్ డెవలప్ మెంట్ టెస్ట్ పేపర్స్ లాంటివి లభిస్తాయి. హమ్ తుమ్ అప్లికేషన్స్ సహాయంతో నోకియా స్మార్ట్ పోన్స్ కలగి ఉన్నవారు మా కెరీర్ పొర్టల్ అయిన www.lampsglow.comని సందర్శించవచ్చు.

నోకియా స్మార్ట్ ఫోన్స్‌లలో ఈ హమ్ తుమ్ అప్లికేషన్‌ని అందుబాటులోకి తీసుకొని రావడం ద్వారా స్డూడెంట్స్ కేవలం కొర్స్‌‌కి సంబంధించిన మెటీరియల్ మాత్రమే కాకుండా కెరీర్ అవకాశాలను కూడా తెలుసుకొవచ్చు. కొత్తగా విడుదల చేస్తున్న ఈ ఎడ్ సర్వ్ హమ్ తుమ్ అప్లికేషన్‌లో పిడిఎఫ్ కన్వర్టర్‌ను కూడా కలిగి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot