సామ్‌సంగ్ వినియోగదారుడికి నోకియా బంపర్ ఆఫర్
గెలాక్సీ ఎస్4లో మంటలు.. బేరసారాలకు దిగిన సామ్‌సంగ్! అనే శీర్సికతో గిజ్‌బాట్ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.

తాజాగా, సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4 పేలుడు గురైన ఘటన ఇంటర్నెట్ ప్రపంచంలో కలంకలం రేపింది. రిచర్డ్ వైగాండ్ (గోస్ట్లీరిచ్) అనే యూట్యూబ్వినియోగదారుడు తన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 పేలుడుకు గురైన తీరును వివరిస్తూ ఓ యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేసారు. ఆ వీడియోను పరిశీలించినట్లయితే ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ పూర్తిగా దెబ్బతిన్నట్లు అర్థమవుతోంది. ఈ పేలుడు ఘటనను ముందుగానే పసిగట్ట అప్రమత్తమవటంతో పెను ప్రమాదం తప్పిందని, లేకుంటే ఆ మంటలు ఫోన్ బ్యాటరీకి భారీ ప్రమాదానికి కారణమయ్యేదని గోస్ట్లీరిచ్ సదరు వీడియోలో పేర్కొన్నారు.
ఈ ఘటన పై స్పందించిన సామ్‌సంగ్ యాజమాన్యం పలు కండీషన్‌ల పై బేరసారాలకు దిగింది. వారంటీలో భాగంగా మరో ఫోన్‌ను రీప్లేస్ చేస్తామని. అయితే, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోను తొలగించాలంటూ ఓ లెటర్‌ను సామ్‌సంగ్ యాజమాన్యం గోస్ట్లీరిచ్‌కు పంపింది. సామ్‌సంగ్ యాజమాన్యం పంపిన ఉత్తరాన్నిచూపిస్తూ గోస్ట్లీరిచ్ మరో వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయటం జరిగింది.
రిచర్డ్‌కు నోకియా బంపర్ ఆఫర్:
గెలాక్సీ ఎస్4 పేలుడు ఘటన వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న నేపధ్యంలో నోకియా యూఎస్ఏ బాధితుడు రిచర్డ్ వైగాండ్ (గోస్ట్లీరిచ్)కు లూమియా ఫోన్‌ను ఉచితంగా ఆఫర్ చేసింది. గోస్ట్లీరిచ్ ట్విట్టర్ అకౌంట్‌కు చేసిన ఓ ట్వీట్‌లో నోకియా యూఎస్ఏ స్పందిస్తూ మేము నీకు సహాయం చేయాలనుకుంటున్నాం. నీకోసం ఓ నోకియా లూమియా ఫోన్‌ను పంపుతున్నాం, నిజమైన కస్టమర్ సర్వీస్‌ను మీరు అస్వాదించవచ్చు. అంటూ సదరు ట్వీట్‌లో నోకియా యూఎస్ఏ పేర్కొంది. నోకియా ఆఫర్ పై స్పందించేందుకు సామ్‌సంగ్ నిరాకరించింది. నోకియా ఆఫర్‌ను బాధిత సామ్‌సంగ్ వినియోగదారుడు స్వీకరిస్తాడో లేదో వేచి చూడాలి.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/dc4duKuPrQ0? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications