నోకియా కొత్త ఫార్ములా!

Posted By: Super

నోకియా కొత్త ఫార్ములా!

 

ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ నోకియా తన లూమియా, ప్యూర్ వ్యూ సిరీస్‌ల నుంచి కొత్త రేంజ్‌‌లో స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ చర్యల్లో భాగంగా ‘సూపర్ హైడ్రోఫోబిక్’ టెక్నాలజీని ఈ సిరికొత్త హ్యాండ్‌‍సెట్‌లలో నిక్షిప్తం చేసేందుకు కసరత్తులు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది.

సూపర్ హైడ్రోఫోబిక్ టెక్నాలజీ అంటే ఏంటి..?

ఈ సరికొత్త వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీ నీరు అదే విధంగా చమ్మవాతావరణం నుంచి స్మార్ట్‌ఫోన్‌ను సంరక్షిస్తుంది. ఈ టెక్నాలజీతో తయారుకాబడిన లూమియా, ప్యూర్ వ్యూ హ్యాండ్‌సెట్‌లను వర్షంలో సైతం వినియోగించుకోవచ్చు. ఈ సూపర్ హైడ్రోఫోబిక్ టెక్నాలజీ ఫోన్‌లలోకి చక్క నీరు ప్రవేశించకుండా జాగ్రత్తవహిస్తుందని నోకియా పశ్చిమ యూరోప్ ఉపాధ్యక్షుడు కోనార్ పియర్స్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తొలిగా లూమియా 610 స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్డడించారు.

నోకియా 808 ప్యూర్ వ్యూ ప్రధాన ఫీచర్లు:

4 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 360 x 640పిక్సల్స్),

1.3గిగాహెడ్జ్ ఆర్మ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

15జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

జీపీఎస్ సపోర్ట్,

బ్లూటూత్,

41 మెగాపిక్సల్ కెమెరా,

1080పిక్సల్ హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,

32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,

1400mAh లియాన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot