నోకియా పీ1, పూర్తి వివరాలు

నోకియా బ్రాండెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో అనేక రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. కాన్సెప్ట్ రెండర్స్ దగ్గర నుంచి మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ వరకు నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో HMD Global లాంచ్ చేయబోతున్న ఆండ్రాయిడ్ ఆధారిత నోకియా ఫోన్‌ల పై మొబైల్ మార్కెట్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది.

Read More : గెలాక్సీ సీ9 ప్రో vs వన్‌ప్లస్ 3టీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్, సామ్‌సంగ్‌లకు పోటీగా..

ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కాబోతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 వేదికగా నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌లు ప్రపంచానికి పరిచయం కాబోతున్నాయి. వాటిలో నోకియా పీ1 కూడా ఒకటి. యాపిల్, సామ్‌సంగ్‌లకు పోటీగా నోకియా అందుబాటులోకి తీసుకురాబోతున్న ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.

ప్రీమియమ్ డిజైన్‌తో..

తాజాగా లీకైన ఓ కాన్సెప్ట్ వీడియో ప్రకారం నోకియా పీ1 ఫోన్ ప్రీమియమ్ డిజైన్‌తో రాబోతంది. ఫోన్ హమ్ బటన్‌‌లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఎంబెడెడ్ చేసారు. రోజో గోల్డ్, బ్లాక్ అలానే సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం.

హై-ఎండ్ స్పెసిఫికేషన్స్

అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం నోకియా పీ1 హై-ఎండ్ స్పెసిఫికేషన్స్‌తో రానుంది. రూమర్స్ మిల్స్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 5.3 అంగుళాల FHD 1080 పిక్సల్ లేదా QHD 1440 పిక్సల్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేసే అవకాశముంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. సరికొత్త Snapdragon 835 ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుందట. 6జీబి ర్యామ్ కెపాసిటీతో అందుబాటులో ఉండే ఈ ఫోన్ 128జీబి/256జీబి స్టోరేజ్ ఆప్షన్ లలో దొరుకుతుందట.

కెమెరా కింగ్...

నోకియా పీ1 ఫోన్‌లో అత్యాధునిక కెమెరా టెక్నాలజీని HMD Global పొందుపరిచినట్లు సమాచారం. మరో రూమర్ ప్రకారం... నోకియా పీ1 ఫోన్ వెనుక భాగంలో 22.3MP Carl Zeiss కెమెరాను ఏర్పాటు చేసారట. IP57 సర్టిఫికేషన్‌తో వస్తోన్న ఈ ఫోన్ నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను సమర్ధవంతంగా ఎదుర్కొగలదట.

శక్తివంతమైన 3500mAh బ్యాటరీ

శక్తివంతమైన 3500mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోన్న నోకియా పీ1 ఫోన్ బలమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుందట. యూఎస్బీ టైప్ - సీ పోర్ట్‌తో పాటు 3.5mm ఆడియో జాక్‌ను ఫోన్ క్రింద భాగంలో ఏర్పాటు చేసారట.

రెండు డిస్‌ప్లే వేరియంట్‌లు..

Nokia P1 రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందట. మొదటి వేరియంట్ 5.2 అంగుళాల డిస్‌ప్లేతో, రెండవ వేరియంట్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం

ఈ ఫోన్స్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన నోకియా Z లాంచర్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయట. నోకియా పీ1, 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర $800 ఉండొచ్చట (మన కరెన్సీలో రూ.54,500). 256జీబి వేరియంట్ ధర $950 ఉండొచ్చట (మన కరెన్సీలో రూ.64,500)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia P1 Android smartphone: price, specs, launch date and more. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot