Home
Mobile

నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD నుంచి భారత్‌లోకి తొలి సొంత బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ లీక్‌..!!

నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD.. భారత్‌ లో సొంత బ్రాండ్‌ తో తొలి స్మార్ట్‌ఫోన్‌ ను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌ సెట్‌ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే Arrow పేరుతో ఈ హ్యాండ్‌సెట్‌ ను లాంచ్ చేయాలని సంస్థ భావించింది. అయితే కొన్ని కారణాలతో మరో పేరుతో ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొన్ని నివేదికల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ జులై నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

భారత్‌ లో లాంచ్ కానున్న HMD తొలి స్మార్ట్‌ ఫోన్‌.. ప్రస్తుతం యూరప్‌ లో అందుబాటులో ఉన్న HMD పల్స్‌ ఫోన్‌ కు రీబ్రాండెడ్‌ గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. HMD సంస్థ ఈ ఫోన్‌ పేరుపై నిర్ణయం తీసుకొనేందుకు పోటీ నిర్వహించింది. దీని ఆధారంగా Arrow పేరును గతంలో ఖరారు చేసింది. స్మార్ట్‌ఫోన్‌ పేరుపై వెనక్కి తగ్గినా.. పోటీలోని విజేతలకు త్వరలో బహుమతులు అందిస్తామని వెల్లడించింది.

hmd-first-smartphone-in-india news

భారత్‌లో లాంచ్‌ కానున్న HMD తొలి స్మార్ట్‌ ఫోన్‌ 5G కనెక్టివిటీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తారన్న వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే 91మొబైల్స్‌ నివేదిక ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ జులై 25న విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ భారత్‌లో HMD తొలి స్మార్ట్‌ఫోన్‌.. యూరప్‌లో ఈ సంవత్సరం ఆగస్టులో విడుదలైన HMD పల్స్‌ ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా అందుబాటులోకి రానుంది. యూరప్‌లో ఈ ఫోన్ ధర EUR 140 (భారత్‌ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.12,460) గా ఉంది. యూరప్‌లో అట్మాస్‌ బ్లూ, డ్రీమీ పింక్‌, మెటోర్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది.

hmd-first-smartphone-in-india news

ఈ HMD పల్స్‌ స్మార్ట్‌ఫోన్ 720*1612 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.65 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆక్టా కోర్‌ 12mm Unisoc T606 చిప్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 13MP వెనుక కెమెరా సహా 8MP సెల్ఫీ కెమెరాతో యూరప్‌లో అందుబాటులో ఉంది. దీంతోపాటు భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్టోరేజీని 256GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia phone maker HMD expected to launch its first smartphone in india on july 25
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X