నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD పేరుతో తొలి స్మార్ట్‌ఫోన్.. పేరేంటో తెలుసా??
నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD గ్లోబల్ తొలిసారిగా సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ను త్వరలో విడుదల చేయనుంది. ఇటీవల తమ బ్రాండ్ తొలిఫోన్ కు పేరు సూచించాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా #HMDNameourSmartphone పోటీని ప్రారంభించింది. ఇందులో అనేక పేర్లను సూచించినట్లు తెలిపింది.
HMD తొలి సొంత బ్రాండ్ ఫోన్ పేరుతో ఏంటంటే?
అయితే చివరగా HMD సంస్థ Arrow పేరును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఈ సంస్థ జతకట్టినట్లు HMD Arrow Smartphone) తెలుస్తోంది. ఫలితంగా ఈ టీమ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే తమ తొలి స్మార్ట్ ఫోన్ పేరును విడుదల చేసింది. త్వరలో ఈ హ్యాండ్ సెట్ భారత్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ రీ బ్రాండెడ్‌గా రానుందా?
భారత్‌లో HMD తొలి సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ Arrow.. HMD పల్స్‌కు రీబ్రాండెడ్‌గా రానుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్ సెట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. హెచ్‌ఎండీ పల్స్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులో ఉంది. అక్కడ ప్రస్తుత ధర EUR 140 గా ఉంది. భారత్ కరెన్సీ ప్రకారం రూ.12,460 గా ఉంది.
6.65 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే :
ఈ హ్యాండ్ సెట్ అట్మాస్ బ్లూ, డ్రీమీ పింక్, మెటీరియర్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. హెచ్‌ఎండీ Arrow హ్యాండ్ సెట్.. పల్స్ స్మార్ట్‌ఫోన్‌కు రీ బ్రాండెడ్‌గా వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో.. పల్స్ హ్యాండ్ సెట్ 720*1612 పిక్సల్ రిజల్యూషన్ తో 6.65 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS :
ఈ స్మార్ట్ ఫోన్ 90Hz రీప్రెష్ రేట్ సహా 600 నిట్స్ గరిష్ఠ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మరియు ఆక్టాకోర్ 12nm Unisoc T606 చిప్ సెట్ పైన పనిచేస్తుంది. 4GB మరియు 64GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
5000mAh బ్యాటరీ సహా :
కెమెరాల పరంగా ఈ హ్యాండ్ సెట్ 13MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్పీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో లాంచ్ అయింది. ఈ హెచ్‌ఎండీ పల్స్ స్మార్ట్ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యా్న్ని కలిగి ఉంటుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








