నోకియా నువ్వు కేక..

ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన నోకియా 301 మొబైల్ నిజమైన హీరో అనిపించుకుంది. వేగంగా దూసుకొస్తున్న తుపాకీ గుండును అడ్డుకుని ఓ వ్యక్తిని ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించింది.

నోకియా నువ్వు కేక..

Read More : సంచలనం రేపుతోన్న గూగుల్, లెనోవో ప్రాజెక్ట్ టాంగో ఫోన్

సోషల్ మీడియాలో సంచలనం రేపుతోన్న ఈ సంఘటన మన పొరుగుదేశమైన ఆఫ్గానిస్తాన్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న నోకియా 301 మొబైల్ ఆకస్మాత్తుంగా దూసుకువచ్చిన బుల్లెట్‌కు అడ్డుపడింది. బుల్లెట్‌కు ఫోన్ అడ్డుపడటంతో అతను ఊపరి పీల్చుకున్నాడు. ఈ వివరాలను స్వయంగా మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ పీటల్ స్కిల్‌మాన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గతంలోనూ..

గతంలోనూ నోకియా ఫోన్ లు తమ స్టామినాను చాటుకున్నాయి. శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో రూపకల్పన చేయబడిన నోకియా లూమియా 1520 నో ఓ పోలీసు అధికారిని బుల్లెట్ దాడి నుంచి రక్షించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్ రంగంలో రారాజు...

ఒకానొక సమయంలో మొబైల్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న నోకియా మొబైల్స్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. నోకియా బ్రాండ్ అంటే ఇండియాలో ఇప్పటికి చాలా మందికి అభిమానం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Nokia 3310...

Nokia 3310... 20వ శతాబ్థం ఆరంభంలో ఈ ఫోన్ పెద్ద సంచలనం. 2000 సంవత్సరంలో విడుదలైన నోకియా 3310 ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్ గేమ్ ఆడాలంటే

సెల్‌ఫోన్‌లో మొబైల్ గేమ్ ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. కానీ, నోకియా 3310 ఫోన్‌లో సింగిల్ హ్యాండ్ చాలు.

ఒక్క చేతితో కంట్రోల్ చేయవచ్చు..

నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్ వంటి గేమ్‌లు కేవలం ఒక్క చేతిలో కంట్రోల్ చేయవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాటరీ బ్యాకప్ కొన్ని రెట్లు అధికం

మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ బ్యాకప్ తో పోలిస్తే నోకియా 1310 బ్యాటరీ బ్యాకప్ కొన్ని రెట్లు అధికం.

 

సులువుగా రిపేర్ చేసుకోవచ్చు

నోకియా 3310ను సులువుగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను రిపేర్ చేసుకునేందుకు పెద్దగా విజ్ఞానం కూడా అవసరం లేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది...

మండుటెండలో సైతం నోకియా 3310 డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది. నోకియా 3310 సరిగ్గా ప్యాంట్ జేబులో ఇమిడిపోతుంది.

క్రింద పడినప్పటికి..

నోకియా 3310ను 5000 సార్లు క్రింది పడేసినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హ్యాంగ్ అవటమనే సమస్యే ఉండదు

నోకియా 1100 హ్యాంగ్ అవటమనే సమస్య నూటికి తొంబై శాతం ఉండదు. ఒకవేళ అయితే ఫోన్ ను స్విచాఫ్ చేసి ఆన్ చేస్తే చాలు సమస్య పరిష్కారమైపోతుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia Phone Saves Man's Life by Allegedly Stopping Bullet. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot