హాలివుడ్‌ను సైతం బుట్టలో పడేసింది

Posted By: Prashanth

హాలివుడ్‌ను సైతం బుట్టలో పడేసింది

 

హాలివుడ్ సైతం నోకియా పై మనసు పారేసుకుందంటూ ఓ సర్వే ఆసక్తిర అంశాలను వెలుగులోకి తెచ్చింది. కావాలంటే మీరే గమనించండి ప్రతి హాలివుడ్ సినిమాలో ఏదో ఒక సన్నివేశంలో నోకియా మొబైల్‌ను వాడుతున్న ద్ళశ్యం కనిపిస్తుంది. హాలివుడ్ యాక్టర్లు మొదలుకుని టెక్నికల్ సిబ్బంది వరకు నోకియా ఫీచర్లను అమితంగా ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే ద్వారా వెల్లడైంది. దీన్ని బట్లే అర్థమవుతుంది ప్రపంచ వ్యాప్తంగా నోకియాకున్న బ్రాండ్ వాల్యూ. మన్నికైన బ్యాటరీ లైఫ్‌ను అందించటంలో నోకియాకు మించిన బ్రాండ్ లేదు.

విశ్వసనీయతకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న నోకియాకు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా దేశాల్లో ఎనలేని ఆదరణ లబిస్తోంది. నోకియా ఉత్పత్తి చేసే సాధారణ ఫోన్‌లు మొదలుకుని హై ఎండ్ ఫోన్‌ల వరకు స్థాయికి తగ్గ మన్నికను కలిగి ఉంటాయి. నోకియా రూపొందించిన సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం అన్ని విధాలైన అప్లికేషన్‌లను సులువుగా రన్ చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉండటం మరింత లబ్ధి చేకూర్చే అంశం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot