Home
Mobile

నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD నుంచి రెండు ఫీచర్‌ ఫోన్‌లు.. ప్రారంభ ధర రూ.999 కే..!!

నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD.. తొలిసారిగా తన సొంత బ్రాండ్‌తో ఫోన్లను విడుదల చేసింది. భారత్‌ మార్కెట్‌లోకి HMD 110 మరియు HMD 105 ఫీచర్‌ ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు అనేక మల్టీ మీడియా ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. మరియు అనేక రంగుల్లో లభించనున్నాయి. పెద్ద డిస్‌ప్లేలు సహా వాయిస్‌ అసిస్టెన్స్‌ సపోర్టుతో లాంచ్‌ అయ్యాయి. బిల్ట్‌ ఇన్‌ UPI యాప్‌లను కలిగి ఉన్నాయి. HMD 110 ఫోన్‌ బ్లాక్, గ్రీన్‌ రంగుల్లో లభిస్తాయి. అదే HMD 105 ఫోన్ బ్లాక్‌, బ్లూ, పర్పుల్‌ రంగుల్లో లభిస్తాయి.

HMD 110, HMD 105 ధర, సేల్ వివరాలు :
సంస్థ వివరాల ఆధారంగా HMD 110 ఫీచర్ ఫోన్ ధర రూ.1,119, HMD 105 ధర రూ.999 గా ఉంది. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్‌ ఫోన్‌లు HMD.com, ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫాంలు, ఆఫ్‌ లైన్‌ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.

HMD launched HMD 110 and HMD 105 feature phones in india

HMD 110, HMD 105 ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ లు :
HMD 110, HMD 105 ఫీచర్‌ ఫోన్లు పెద్ద డిస్‌ప్లే, వాయిస్‌ అసిస్టెన్స్‌, కాల్‌ రికార్డింగ్‌, MP3 ప్లేయర్‌, Phone Talker, FM రేడియోను కలిగి ఉంటాయి. HMD 110 వెనుక వైపు కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. అదే HMD 105 ఫీచర్‌ ఫోన్‌ డ్యూయల్‌ ఫ్లాష్‌ లైట్‌ ను కలిగి ఉంటుంది.

HMD 110, HMD 105 ఫీచర్‌ ఫోన్‌లు ఇన్‌బిల్ట్ UPI యాప్‌లను కలిగి ఉంటాయి. ఫలితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నగదును బదిలీ చేసేందుకు వీలుగా ఉంటాయని సంస్థ చెబుతోంది. ఈ రెండు ఫీచర్‌ ఫోన్‌లు 1000mAh బ్యాటరీలను కలిగి ఉంటాయి. గరిష్ఠంగా 18 రోజులపాటు స్టాండ్‌బై టైం (Standby Time) వస్తుందని సంస్థ తెలిపింది. 9 భాషలను ఈ ఫోన్లు సపోర్టు చేయనున్నాయి.

HMD సంస్థ ఫీచర్‌ ఫోన్‌ల తోపాటు సొంత బ్రాండ్‌ తో స్మార్ట్‌ ఫోన్‌ లను కూడా త్వరలో విడుదల చేయనుంది. తక్కువ ధరలోనే ఈ హ్యాండ్‌ సెట్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. HMD Arrow పేరుతో భారత్‌లో విడుదల కానుంది. HMD Pulse కు రీబ్రాండెడ్‌ గా అందుబాటులో రానుందని సమాచారం. యూరప్‌ లో ఈ సంవత్సరం EU140 ధరకు (భారత కరెన్సీలో రూ.12,500) అందుబాటులో ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia Phones maker HMD launched HMD 110 and HMD 105 feature phones in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X