ఆ రోజుల్లో నోకియా అంటే..

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు కాలక్రమంలో అనేక ఒడిదుడుకులే ఎదుర్యయ్యాయి. అయినప్పటికి, నోకియా తన ప్రయత్నాలను మానకోలేదు.

|

1990 నుంచి 2000 సంవత్సరాల మధ్య నోకియా ఫోన్‌లు ప్రపంచాన్ని శాసించగలిగాయి. మొబైల్ ఫోన్ యూజర్లకు, ఆ రోజుల్లో నోకియా అంతలా కనెక్ట్ అవ్వాటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ సేపు ఉపయోగించుకునే విధంగా సమర్థవంతమైన బ్యాటరీ బ్యాకప్, ఆపరేట్ చేసేందుకు సులువైన యూజర్ ఇంటర్‌ఫేస్, అమోదయోగ్యమైన ధర వంటి అంశాలు నోకియా బ్రాండ్ వాల్యూను ఒక్కసారిగా పెంచేసాయి.

ఆ రోజుల్లో నోకియా అంటే..

Read More : మీ బ్రౌజింగ్ హిస్టరీని ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా మద్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోని రూపోందించడంతో నోకియా మొబైల్ మార్కెట్ శరవేగంగా విస్తరించగలిగింది. అందుకే, ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియాకు ప్రత్యేక స్థానం ఉంది. మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు కాలక్రమంలో అనేక ఒడిదుడుకులే ఎదుర్యయ్యాయి. అయినప్పటికి, నోకియా తన ప్రయత్నాలను మానకోలేదు. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్‌లతో మరోసారి మనముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన పలు నోకియా ఫోన్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం..

నోకియా 3310

నోకియా 3310

2000 సంవత్సరంలో నోకియా నుంచి విడుదలైన 3310 మోడల్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. 5 -లైన్ మోనో క్రోమ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌లో సింప్లిస్టిక్ యూజర్ ఇంటర్‌‌ఫేస్ ఆకట్టుకుంటుంది. క్యాలుక్యులేటర్, స్టాప్ వాచర్, రిమైండర్, Snake II వంటి సుప్రసిద్ధ గేమ్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్లో మీరే సొంతంగా రింగ్ టోన్ కంపోజ్ చేసుకోవచ్చు.

నోకియా 1100

నోకియా 1100

2003 సంవత్సరంలో నోకియా నుంచి విడుదలైన నోకియా 1100 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. డస్ట్ ఇంకా స్ప్లాష్ రెసిస్టెంట్ బాడీతో వచ్చిన,ఈ ఫోన్‌కు ఫ్లాష్‌లైట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. భారత్‌లో ఈ ఫోన్‌ను టార్చ్ ఫోన్‌గా కూడా పిలుస్తారు. 4-లైన్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో BL-5C 850mAh బ్యాటరీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ బ్యాటరీ 400 గంటల స్టాండ్‌బై యూసేజ్‌ను అందించగలదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా 6600
 

నోకియా 6600

2003లో నోకియా నుంచి విడుదలైన మరో మోడల్ ఫోన్ నోకియా 6600, ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. నోకియా సింబియాన్ OS 7.0 (Series 60) ప్లాట్‌ఫామ్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో 104 MHz ARM 9 ప్రాసెసర్తో పాటు 6 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందుపరిచారు. పోన్ వెనుక భాగంలో 0.3 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.

నోకియా 5200, 5300

నోకియా 5200, 5300

మ్యూజిక్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని నోకియా లాంచ్ చేసిన 5200, 5300 ఫ్లిప్ మోడల్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ యూనిట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం. ఎఫ్ఎమ్ రేడియో అలానే ఎంపీ3 ప్లే బ్యాక్ సపోర్ట్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్‌లలో 2జీబి వరకు మైక్రోఎస్డీ కార్డ్ సదుపాయాన్ని కల్పించారు. నోకియా సిరీస్ 40 ఇంటర్‌ఫేస్‌తో వచ్చిన ఈ ఫోన్‌లు అప్పటో ఓ సంచలనం.

నోకియా ఇ71

నోకియా ఇ71

బ్లాక్‌బెర్రీకి పోటీగా నోకియా లాంచ్ చేసిన మొట్లమొదటి క్వర్టీ కీప్యాడ్ ఫోన్ నోకియా ఇ71. సింబియన్ 9.2 ఆపరేటింగ్ సిస్టంతో వచ్చిన ఈ ఫోన్‌లో 369MHz ఆర్మ్ ప్రాసెసర్తో పాటు 128ఎంబి ర్యామ్‌ను ఏర్పాటు చేసారు. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు పొడిగించుకునే అవకాశాన్ని కల్పించారు. 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ రోజు మొత్తానికి బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేయగలదు. 2జీ ఇంటర్నెట్ ను సపోర్ట్ చేయగలిగే ఈ ఫోన్ ద్వారా మెయిల్స్ కూడా పంపుకునే అవకాశాన్ని కల్పించారు.

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

సెల్‌ఫోన్‌లో మొబైల్ గేమ్ ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. అయితే, నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమీ వంటి గేమ్‌లు కేవలం ఒక్క వేలుతో కంట్రోల్ చేయవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా 3310 అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండేది. నోకియా 3310ను సలువుగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను రిపేర్ చేసుకునేందుకు పెద్దగా విజ్ఞానం కూడా అవసరం లేదు.

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

మండుటెండలో సైతం నోకియా 3310 డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది. నోకియా 3310 సరిగ్గా ప్యాంట్ జేబులో ఇమిడిపోతుంది.నోకియా 3310ను 5000 సార్లు క్రింది పడేసినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా మొదటి కెమెరా ఫోన్ ‘నోకియా 7650' 2001లో విడుదలైన హాలీవుడ్ చిత్రం మైనార్టీ రిపోర్ట్‌లో వినియోగించారు. 2003లో నోకియా వీడియో రికార్డర్ తో కూడిన మొట్టమొదటి ఫోన్‌ను ఆవిష్కరించింది. ఆ మోడల్ పేరు నోకియా 3650.

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

2005లో నోకియా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిజిటల్ కెమెరాల విక్రయించిన బ్రాండ్‌గా గుర్తింపును మూటగట్టుకుంది. 2005లో నోకియా ఎన్70 పేరుతో డెడికేటెడ్ కెమెరా షట్టర్ బటన్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా ఫోన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా నుంచి 2006లో విడుదలైన మరో కెమెరా ఫోన్ నోకియా ఎన్93 ఈ కెమెరా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంది. 2008లో నోకియా కొడాక్‌కు మించి కెమెరాలను విక్రయించగలిగింది. 2011లో ప్రపంచపు అతిపెద్ద స్టాప్-మోషన్ యానిమేషన్ చిత్రాన్ని నోకియా ఎన్8 ద్వారా చిత్రీకరించటం విశేషం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
5 Nokia Phones That Made History. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X